ర‌కుల్‌కిది పెద్ద ప‌రీక్షే

Rakul pins hopes on De De Pyaar De
Wednesday, May 15, 2019 - 22:00

ర‌కుల్ హీరోయిన్‌గా న‌టించిన బాలీవుడ్ చిత్రం...దే దే ప్యార్ దే. ఈ ఫ్రైడే విడుద‌ల కానుంది. అజ‌య్ దేవ‌గ‌న్ హీరోగా నటించిన ఈ మూవీలో ఆమె యంగ్ ప్రేమికురాలిగా న‌టించింది. అజ‌య్ దేవ‌గ‌న్ 50 ఏళ్ల వాడిగా, భార్యాపిల్ల‌లున్న వ్య‌క్తిగా న‌టించాడు. 

ఈ 50 ఏళ్ల వాడు పాతికేళ్ల ప‌డ‌తితో ప్రేమ‌లో ప‌డితే క‌లిగే ప‌ర్య‌వ‌సనాలేంట‌నేది దే దే ప్యార్ దే క‌థ‌. ర‌కుల్‌కి బాలీవుడ్‌లో న‌టించ‌డం కొత్త కాదు. ఆమె న‌టించిన రెండు సినిమాలు ఇంత‌కుముందు బాలీవుడ్‌లో విజ‌యం సాధించాయి. ఐతే ఆమెకి ఇప్ప‌టి వ‌ర‌కు బాలీవుడ్‌లో క్రేజ్ రాలేదు. అజ‌య్ దేవ‌గ‌న్ పెద్ద హీరో కావ‌డంతో ఈ సారి మంచి బ్రేక్ వ‌స్తుంద‌ని ఆశ‌లు పెట్టుకొంది.

రకుల్‌తో పాటు ట‌బు కూడా న‌టించింది ఇందులో. ఐతే ఈ సినిమా అంద‌రిక‌న్నా కీల‌కం మాత్రం ర‌కుల్‌కే. తెలుగులో ప్ర‌స్తుతం నాగార్జున స‌ర‌స‌న మ‌న్మ‌ధుడు 2లో న‌టిస్తోంది.