పూరికి బిస్కెట్లు వేస్తున్న రకుల్

Rakul Preet Singh wants to act in Puri's film
Wednesday, October 16, 2019 - 17:00

ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తో ఏకంగా విజయ్ దేవరకొండతో మూవీ లాక్ చేసుకున్నాడు పూరి జగన్నాధ్. ఈ ప్రాజెక్ట్ కు "ఫైటర్అ" నే టైటిల్ కూడా పెట్టాడు. అయితే హీరోయిన్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు. మొన్నటివరకు అలియాభట్, జాన్వి కపూర్ అంటూ బాలీవుడ్ చుట్టూ తిరిగిన పూరి, ఇప్పుడు టాలీవుడ్ లోనే ఓ క్రేజీ హీరోయిన్ ను తన సినిమాలో పెట్టుకోవాలని భావిస్తున్నాడు.

ఈ విషయం ఆనోటా ఈనోటా తెలుసుకున్న రకుల్ ప్రీత్ సింగ్, ఇప్పుడు ఫైటర్ సినిమాలో ఛాన్స్ కోసం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా పూరి జగన్నాధ్ తో వర్క్ చేయాలని చాన్నాళ్లుగా అనుకుంటున్నానని, కానీ ఆ కోరిక ఇంకా తీరలేదని ఫీలర్లు వదలుతోంది. ఇక్కడితో ఆగకుండా.. ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ సరసన నటించాలనే కోరికను కూడా వ్యక్తంచేస్తోంది. 

రకుల్ స్టేట్ మెంట్స్ చూస్తుంటే.. ఆమె ఫైటర్ సినిమాలో ఛాన్స్ ఆశిస్తుందనే విషయం అర్థమౌతూనే ఉంది. కాకపోతే ఆమె స్టేట్ మెంట్స్ పూరి వరకు వెళ్లాయా లేదా అనేదే డౌట్. అసలు ఇలాంటి ఇండైరెక్ట్ సిగ్నల్స్ లాంటివి పెట్టుకోకుండా.. నేరుగా చార్మిని కలిస్తే పనైపోతుంది కదా. ఈ షార్ట్ కట్ ఒకటి ఉందని రకుల్ కు తెలియదేమో.