హీరోగా ర‌కుల్ ప్రీత్ సింగ్ సోద‌రుడు అమ‌న్

Rakul Preet Singh's brother Aman as hero launched
Sunday, February 24, 2019 - 17:00

ర‌కుల్‌ ప్రీత్ సింగ్ సోద‌రుడు అమ‌న్ క‌థానాయ‌కుడిగా సినిమా మొద‌లైంది. దాస‌రి లారెన్స్ ద‌ర్శ‌క‌త్వంలో మావురం ర‌జిని నిర్మాత‌గా ఆదివారం హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోలో ప్రారంభ‌మైంది. ముహుర్త‌పు స‌న్నివేశానికి ర‌కుల్ ప్రీత్ సింగ్ క్లాప్ కొట్ట‌గా, హీరో సందీప్ కిష‌న్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మంచు ల‌క్ష్మి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

"నా సోద‌రుడు అమ‌న్ హీరోగా సినిమా ప్రారంభం కావ‌డం ఎంతో ఆనందంగా ఉంది. రెండేళ్ల క్రితం త‌న‌కు హీరో కావాల‌నుంద‌ని చెప్ప‌గానే.. ప్యాష‌న్ ఉందా? ఉంటేనే ఇండ‌స్ట్రీలోకి రావాలని త‌న‌తో అన్నాను. త‌ను ప్యాష‌న్ ఉంద‌ని చెప్పాడు. ఎంతో ప‌ట్టుద‌ల‌గా తెలుగు నేర్చుకుని త‌న ప్యాష‌న్ ఏంటో చూపించాడు. నాకు హైద‌రాబాద్ హోం టౌన్ ఎలా అయ్యిందో.. అమ‌న్‌కు కూడా ఇప్పుడు హైద‌రాబాద్ హోం టౌన్‌లా మారింది. త‌ను మంచి హీరోగా పేరు తెచ్చుకుంటాడ‌ని భావిస్తున్నాను", అని  ర‌కుల్ ప్రీతి సింగ్ చెప్పింది.

"సంతోషంతో మాట‌లు రావ‌డం లేదు. చాలా నెర్వ‌స్‌గా, టెన్ష‌న్‌గా ఉంది. తెలుగులో హీరోగా ఎంట్రీ అవుతుండ‌టం చాలా సంతోషంగా ఉంది. మంచి క‌థ‌, స్క్రీన్‌ప్లేతో ద‌ర్శ‌కుడు దాస‌రి లారెన్స్‌గారు చెప్పిన విధానం న‌చ్చింది. అంద‌రికీ న‌చ్చుతుంది. అలాగే నిర్మాత ర‌జినిగారికి థాంక్స్‌," హీరో అమ‌న్ అన్నారు. 

అమ‌న్‌, మోనికా శ‌ర్మ హీరో హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రానికి మ్యూజిక్‌ మోహిత్ రెహ‌మానిక్ అందిస్తున్నారు.