ర‌కుల్ అకౌంట్ హ్యాక్ అయింది!

Rakul Preet Singh's Instagram hacked
Wednesday, October 24, 2018 - 15:15

ర‌కుల్ ప్రీతి సింగ్ ఇన్ స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌. త‌న ఫోటోల‌ను రెగ్యుల‌ర్‌గా షేర్ చేస్తుంటుంది. చాలా హాట్ హాట్ ఫోజుల‌తో కూడిన ఫోటోల‌నే పెడుతుంటుంది. అందుకే ఆమెకి 5 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉన్నారు ఇన్ స్టాగ్రామ్‌లో.

ఐతే ఈ అకౌంట్ హ్యాక్ అయింద‌ట‌. ఎవ‌రూ ఈ అకౌంట్‌ని ఓపెన్ చేయొద్దు అని ముందే త‌న అభిమానుల‌ను హెచ్చిరించింది. త్వ‌ర‌లోనే రిస్టోర్ చేసుకుంటాన‌ని చెప్పింది. జ‌న‌ర‌ల్‌గా హ్య‌క్ అయిన అకౌంట్‌ల‌లో బూతు బొమ్మ‌ల‌ను అప్‌లోడ్ చేస్తుంటారు హ్య‌క‌ర్స్‌. ల‌క్కీగా ర‌కుల్‌కి ఆ ప్ర‌మాదం క‌ల‌గ‌లేదు.

అన్న‌ట్లు ర‌కుల్ చాలా గ్యాప్ త‌ర్వాత తెలుగులో హీరోయిన్‌గా ఒక మూవీ ఒప్పుకొంది. ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో శ్రీదేవి పాత్ర‌తో పాటు నాగ చైత‌న్య స‌ర‌స‌న హీరోయిన్‌గా మూవీ సైన్ చేసింది. బాబీ డైర‌క్ట్ చేసే ఈ మూవీ వ‌చ్చే నెల‌లో ప్రారంభం అవుతుంది.