లక్ష్మీని ర‌కుల్ ముద్దాడిన వేళ‌!

Rakul shares a pic with Lakshmi Manchu; trolling begins
Sunday, October 7, 2018 - 11:00

ర‌కుల్ ప్రీతిసింగ్‌, మంచు ల‌క్ష్మీ స్నేహితురాళ్లు. వారిద్ద‌రూ త‌మ మ‌ధ్య ఉన్న అప్యాయ‌త‌ని బ‌హిరంగంగానే వ్య‌క్త‌ప‌రుచుకుంటారు త‌రుచుగా సోష‌ల్ మీడియా వేదిక‌గా. స్నేహన్ని ఒక్కొక్క‌రు ఒక్కో తీరుగా జ‌నాల‌కి చూపుతుంటారు. అందులో త‌ప్పేమీలేదు. ఐతే సెల‌బ్రిటీలు చేసే కొన్ని చ‌ర్య‌లు కొంత‌ అతిగా అనిపిస్తుంటాయి. అలాంటిదే తాజాగా ర‌కుల్ షేర్ చేసిన ఫోటో.

ల‌క్ష్మీని గ‌ట్టిగా ఆలింగ‌నం చేసుకొని ఆమె బుగ్గ‌పై ముద్దు పెడుతున్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోని ర‌కుల్ షేర్ చేసింది. ఇందులో త‌ప్పు ప‌ట్టాల్సిన విష‌యం ఏమీ లేదు. అది వారి మ‌ధ్య ఉన్న అనుబంధాన్ని, అభిమానాన్ని చూపుతోంది. ఐతే కొంద‌రి నెటిజెన్ల‌కిది అతిగా అనిపించిన‌ట్లుంది. వారిని ట్రాల్ చేయ‌డం మొద‌లుపెట్టారు.

వీరి ఫోజు బాగాలేదంటూ రకుల్ పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఐతే కొన్ని స్నేహాలు కేవ‌లం అంత‌కుమించిన బంధాలు అంటూ ర‌కుల్ త‌న ఆనందాన్ని వ్య‌క్త‌ప‌రిచిన‌పుడు ట్రాల్ చేయ‌డం క‌రెక్టేనా?