ఈ సారి దీపావ‌ళి అని టాక్‌!

Ram Charan and Boyapati movie first look
Saturday, October 27, 2018 - 10:45

రామ్‌చ‌ర‌ణ్ - బోయ‌పాటి సినిమా మొద‌టి లుక్ వ‌చ్చేస్తోంది అంటూ గ‌త ఆగ‌స్ట్ 22 నుంచి ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఎప్ప‌టిక‌పుడు కొత్త డేట్‌ల ప్ర‌చారం, ఆ డేట్‌కి రాక‌పోవ‌డం అనేది కామ‌న్ అయింది. మొద‌ట మెగాస్టార్ బ‌ర్త్‌డేకి (ఆగ‌స్ట్ 22) వ‌స్తుంద‌న్నారు. ఆ త‌ర్వాత బాబాయ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌ర్త్‌డేకి (సెప్టెంబ‌ర్ 22) అన్నారు. వెంట‌నే వినాయ‌క చ‌వితి (సెప్టెంబ‌ర్ 13) చెప్పారు. ఆ త‌ర్వాత ద‌స‌రాకి ప‌క్కాగా అని ఊద‌ర‌గొట్టారు. 

ఇపుడు అన్ని అకేష‌న్లు, పండ‌గ‌లు అయిపోయాయి. మిగిలింది దీపావ‌ళి పండుగ‌. ఈసారి దీపావ‌ళికి రిలీజ్ చేస్తార‌ని ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో మ‌ళ్లీ హంగామా మొద‌లుపెట్టారు. కానీ టీమ్ నుంచి మాత్రం అధికార‌క ప్ర‌క‌ట‌న మాత్రం రావ‌డం లేదు. ఒకవైపు, రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి మ‌ధ్య అభిప్రాయ భేదాలు వ‌చ్చాయ‌నే టాక్‌. మ‌రోవైపు, ఈ ఫ‌స్ట్‌లుక్ ఆల‌స్యం అవుతుండ‌డంతో ఏదో జ‌రుగుతోంద‌న్న అభిప్రాయం మొద‌లైంది. 

మ‌రి ఈ పుకార్ల‌కి, ప్ర‌చారాల‌కి బ్రేక్ ఎపుడు ప‌డుతుంది. రామ‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి సినిమా గ్యాంగ్‌లీడ‌ర్ త‌ర‌హాలో సాగే డ్రామాన‌ట‌. అన్న‌ని చంపిన వాడిపై హీరో ప‌గ‌తీర్చుకునే క‌థ‌.