ఆ గాసిప్ నిజ‌మే: రామ్‌చ‌ర‌ణ్‌

Ram Charan confirms that that rumor was true
Monday, January 7, 2019 - 19:15

చెప్పిన టైమ్ కు "సైరా" రావడం లేదు. ఇది గాసిప్ కాదు, స్వయంగా రామ్ చరణ్ వెల్లడించిన విషయం. లెక్కప్రకారం "సైరా" సినిమా సమ్మర్ ఎండింగ్ లో మే నెలాఖరుకు లేదా జూన్ కు రావాలి. కానీ ఆ టైమ్ కు సినిమా రాదని రామ్ చరణ్ స్పష్టంచేశాడు. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉన్న సైరా సినిమాను ఈ ఏడాది సెకండాఫ్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించాడు.

అటుఇటుగా సెప్టెంబర్ లో సైరా సినిమా థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ ఉందని స్పష్టంచేశాడు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న హిస్టారికల్ మూవీ "సైరా నరసింహారెడ్డి". కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా మేకింగ్ సందర్భంగా చిరంజీవి తనకు మరింత కొత్తగా కనిపించారని చెబుతున్నాడు చరణ్. ఉదయం 5 గంటలకే నిద్రలేచి, మేకప్ వేసుకొని సరిగ్గా 7 గంటలకు చిరంజీవి రెడీ అవుతుంటే ఆశ్చర్యపోయానంటున్నాడు చరణ్.

చిరంజీవి లాంటి వ్యక్తి కోసం తాము వెయిట్ చేయాలని, కానీ 7.30కల్లా మేకప్ తో రెడీ అయిపోయి తమ కోసం సెట్స్ లో చిరంజీవి వెయిట్ చేస్తుంటే సిగ్గేసిందని చెప్పుకొచ్చాడు చరణ్. ప్రేక్షకులు సైరా గురించి ఎన్ని అంచనాలు పెట్టుకుంటున్నారో, వాటికి వంద రెట్లు మెరుగ్గా సినిమా ఉంటుందని అంటున్నాడు చరణ్. మరో 2 నెలల్లో టోటల్ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేయబోతున్నట్టు ప్రకటించాడు.