చ‌ర‌ణ్‌తో రానా షో ముగింపు

Ram Charan as guest for Rana's Yaari show
Friday, January 4, 2019 - 16:00

రానా హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న యారి షో రెండో సీజ‌న్‌కి ఎండ్ కార్డ్ ప‌డుతోంది. మొద‌టి సీజ‌న్‌ని రానా బాగా పాపుల‌ర్ చేశాడు. కానీ రెండో సీజ‌న్ క్లిక్ అవ‌లేదు. ఐతే ఎండింగ్ ఎపిసోడ్‌కి కిక్ రావాలంటే పెద్ద స్టార్ అయితే బాగుంటుంద‌నే ఉద్దేశంతో త‌న క్లోజ్‌ఫ్రెండ్ రామ్‌చ‌ర‌ణ్‌ని ఇన్వైట్ చేశాడు.

నెంబ‌ర్‌వ‌న్ యారి షో త‌న నెంబ‌ర్‌వ‌న్ ఫ్రెండ్ చ‌ర‌ణ్‌తో క్లోజ్ అవుతుంది. కొత్త ఏడాదిలో మొద‌టి షూట్ ఇదే అంటూ రానా ఈ విష‌యాన్ని షేర్ చేశాడు. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుగుతోంది. జ‌నాల‌కి తెలియ‌ని ఎన్నో కొత్త విష‌యాల‌ను చ‌ర‌ణ్ నుంచి రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తాడ‌ట‌.

సంక్రాంతి స్పెష‌ల్‌గా ఈ కార్య‌క్ర‌మం ప్ర‌సారాం కానుంది. రామ్‌చ‌ర‌ణ్ కూడా సంక్రాంతి త‌ర్వాతే రాజ‌మౌళి తీస్తున్న ఆర్‌.ఆర్‌.ఆర్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడు. ప్ర‌స్తుతం విన‌య విధేయ రామ ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉన్నాడు.