దాచిన విషయాన్ని కైరా చెప్పేసింది

Ram Charan reveals that Kiara busted his secret
Tuesday, January 8, 2019 - 23:45

రామ్ చరణ్ ఫేస్ బుక్ ఎకౌంట్ గురించి అందరికీ తెలుసు. కానీ ఈ హీరోకు ఇనస్టాగ్రామ్ ఎకౌంట్ కూడా ఉంది. ఈ విషయాన్ని హీరోయిన్ కైరా అద్వానీ బయటపెట్టింది. రామ్ చరణ్ సీక్రెట్ గా ఓ ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ మెయింటైన్ చేస్తున్నాడని చెప్పేసింది. దీనిపై చరణ్ రియాక్ట్ అయ్యాడు.

"అవును.. ఇన్‌స్టాగ్రామ్ లో నాకు సీక్రెట్ ఎకౌంట్ ఉంది. కానీ దాన్ని నేను బయటపెట్టదలుచుకోలేదు. సీక్రెట్ గానే ఉంచుతాను. సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు అలాంటి ఎకౌంట్ ఒకటి ఉండాలి. కైరా అద్వానీ ఈ విషయాన్ని బయటపెట్టేసింది. ఆ తర్వాతే అందరికీ తెలిసింది, అని చెప్పాడు చ‌ర‌ణ్‌.

మెగాస్టార్ హీరోగా తన నిర్మాణంలో తెరకెక్కుతున్న సైరా సినిమాపై కూడా చెర్రీ రియాక్ట్ అయ్యాడు. సినిమా షెడ్యూల్స్ లేటుగా జరుగుతున్న విషయాన్ని అంగీకరిస్తూనే..  రీషూట్స్ జరగడం లేదని స్పష్టంచేశాడు. సినిమాను దసరాకు తీసుకొస్తామని ప్రకటించాడు.

"సైరా పుకార్ల విషయంలో దాచడానికేం లేదు. ఈ విషయంలో నేను అబద్ధాలు చెప్పదలుచుకోలేదు. అంతా కరెక్ట్ గా వెళ్తుందని నేను చెప్పను. అది పెద్ద సినిమా. అప్పుడప్పుడు షెడ్యూల్స్, డేట్స్, సెట్ ప్రాపర్టీస్ మారుతుంటాయి. దాని వల్ల షూటింగ్ డిలే అవుతుంది. అది కామన్. ఓవరాల్ గా చూసుకుంటే చాలా హ్యాపీగా షూటింగ్ జరుగుతోంది. అనుకున్న బడ్జెట్ లోనే జరుగుతుంది. 2 నెలల్లో షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో మంచి డేట్ చూసి రిలీజ్ చేస్తాం. దసరాకు తీసుకొద్దాం అనుకుంటున్నాం. సైరాకు సంబంధించి ఎలాంటి రీషూట్స్ జరగలేదు. మా దగ్గర అంత డబ్బు కూడా లేదు."

సైరా కోసం 200 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించామని తెలిపిన చరణ్.. ఇప్పటివరకు సౌత్ లో ఏ హీరోకు ఇవ్వనంత రెమ్యూనరేషన్ ను చిరంజీవికి ఇచ్చానని అంటున్నాడు.