మీటూపై వ‌ర్మ మాట ఇదే!

Ram Gopal Varma responds on Me Too
Friday, October 19, 2018 - 23:00

మీటూ వివాదం భార‌తీయ సినిమా ప‌రిశ్ర‌మ‌ని కుదిపేస్తోంది. సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ వంటి పాపుల‌ర్ హీరోల‌పై కూడా లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. మీటూ ఒక ఉద్య‌మంలా మారింది. హీరోయిన్ల‌ని లైంగిక వేధింపుల‌కి గురిచేసే సంస్కృతి సినిమా ఇండ‌స్ట్రీలో రూపుమాపుదిశ‌గా చ‌ర్య‌లు మొద‌ల‌యిన‌ట్లే.

రాంగోపాల్ వ‌ర్మ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. మీటూ గురించి మీ మాట ఏంట‌ని అడిగితే..ఇక‌పై మ‌గ‌వాళ్లు ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని ప్ర‌వ‌ర్తిస్తార‌ని చెప్పాడు వ‌ర్మ‌. ఇంత‌కుముందు న‌టుడు నానా ప‌టేక‌ర్‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌పుడు... వ‌ర్మ స్పందించాడు. నానా అలాంటి వాడు కాద‌ని చెప్పాడు. ఐతే ఆరోప‌ణ‌లు చేసిన త‌నుశ్రీ దత్తా అబ‌ద్దాలు చెపుతోంద‌ని కూడా అన‌ను అని వివ‌ర‌ణ ఇచ్చాడు. 

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో వ‌ర్మ ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని ద‌స‌రా సంద‌ర్భంగా మొద‌లుపెట్టాడు. తిరుప‌తిలో సాయంత్రం ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి.