నేను నా మందు గ్లాసు దాచ‌ను: వ‌ర్మ‌

Ram Gopal Varma says he doesn't hide drink glass
Saturday, February 23, 2019 - 23:15

నేను నా మందు గ్లాసుని దాచ‌ను: వ‌ర్మ‌
రాంగోపాల్ వ‌ర్మ వోడ్కా పుచ్చుకుంటాడ‌నేది ..తూర్పున సూర్యుడు ఉద‌యిస్తాడ‌నేంత నిజమ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆ విష‌యాన్ని ఆయ‌నే గ‌ర్వంగా చెప్పుకుంటారు. ఆయ‌న తీసే సినిమాలు మ‌న‌కి న‌చ్చొచ్చు, న‌చ్చ‌క‌పోవ‌చ్చు కానీ ఆయ‌న బోల్డ్ యాటిట్యూడ్‌కి ఫిదా కాని వారు ఉండ‌రు. అంతేకాదు, ఎవ‌రినైనా ట్రోల్ చేయాల‌న్నా ఆయ‌న్ని మించినోడు ఉండ‌రు.

మిడ్‌నైట్ వోడ్కా సేవ‌నం టైమ్‌లో భాగంగా తాజాగా ఒక ఫోటోని షేర్ చేశారు. ఆ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంక‌టేష్‌, శ్రీదేవి, వ‌ర్మ‌ ఉన్నారు. ఈ గ్రూప్ ఫోటోఎదో ఒక ప్రైవేట్ పార్టీకి సంబంధించింది. ఆ పార్టీలో మందు గ్లాస్‌ని చేతిలో ప‌ట్టుకునే ఫోటోకి ఫోజు ఇచ్చారు వ‌ర్మ‌. దానికి ఆయ‌న పెట్టిన క్యాప్స‌న్ ఏంటో తెలుసా?

చివ‌ర్లో ఉన్న మ‌హా ల‌ఫూట్ గాణ్ణి నేనే. నేను నిజాయితీప‌రుడ్ని కాబ‌ట్టి నా గ్లాస్‌ని దాయ‌లేదు. కొంద‌రు దాస్తున్నారు అంతే అంటూ ట్వీట్ చేశాడు. 

వ‌ర్మ ఒక్క రౌండ్‌తోనే..అదేనండి ఒక్క ట్వీట్‌తో ఆపుతారా? వెంట‌నే దానికి కొనసాగింపుగా మ‌రోటి యాడ్ చేశాడు.

ఈ చివ‌ర, ఆ చివ‌ర ఉన్న‌వారి చేతిలో గ్లాస్ క‌నిపిస్తోంది. శ్రీదేవి గారి రెండు చేతులు ముందే ఉన్నాయి. ఎందుకంటే నిజాయితీ మా ముగ్గురిలోనే ఉంది.

వెంక‌టేష్‌, చిరంజీవి గ్లాసులు దాస్తున్నార‌న్న‌ట్లుగా సెటైర్ వేశారు వ‌ర్మ‌. ఇది వ‌ర్మ వోడ్కా ట్వీటాయ‌నం!