రామ్ ..డబుల్ కా మీఠా

Ram plays dual roles in next movie
Wednesday, October 23, 2019 - 13:30

మొన్న రామ్ డబుల్ దిమాగి అన్నాడు. ఇప్పుడు డబులు కా మీఠా అంటున్నాడు. 

తన బుర్రలో వేరే వాడి చిప్ పెట్టుకొని ఇస్మార్ట్ శంకర్ గా అదరగొట్టాడు. ఇక ఇప్పుడు కెరీర్లో ఫస్ట్ టైం ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ చెయ్యబోయే సినిమా ఒక రీమేక్. తమిళంలో రూపొందిన 'తడం' (పాద ముద్ర) అనే సినిమాని తెలుగులో రామ్ హీరోగా రీమేక్ చేస్తున్నాడు దర్శకుడు కిశోర్ తిరుమల తీసే ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. హీరోయిన్లు కూడా ఇద్దరు ఉంటారు. అంటే డబల్ గ్లామర్. 

బ్రోచేవారెవరురా, చిత్రలహరి వంటి  సినిమాల్లో నటించిన నివేధా పేతురాజు, 'నేల టికెటు' వంటి సినిమాల్లో నటించిన మాళవిక శర్మ హీరోయిన్లు గా ఫిక్స్ అయ్యారు. ఇది కూడా మంచి కాన్సెప్టుతో రెడీ అవుతోంది. ద్విపాత్రాభినయం అంటే రెగ్యులర్ డ్యూయల్ రోల్సు కాదు. చాలా కొత్తగా ఉండే పాత్రలు. 

రెండు పాత్రలు, ఇద్దరు హీరోయిన్లతో తన అభిమానులకి డబల్ కా మీఠా లాంటి ట్రీట్ ఉంటుంది అంటున్నాడు రామ్.