రాహుల్ రామ‌కృష్ణా...ఏంటిది?

Ramakrishna's unprofessional attitude
Saturday, February 23, 2019 - 15:15

"అర్జున్‌రెడ్డి", "గీత గోవిందం" సినిమాల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రెండ్‌గా అద్భుతంగా అద‌రగొట్టాడు. "అర్జున్‌రెడ్డి" సినిమాలో రాహుల్ పాత్ర‌, అత‌ని న‌ట‌న సూప‌ర్‌. మంచి ఇంటిలెజెంట్ అయిన రాహువల్ రామ‌కృష్ణ‌.. ఇపుడు తెలుగులో బిజీ క‌మెడియ‌న్‌. అత‌ను, ప్రియ‌ద‌ర్శి క‌లిసి హీరోలుగా న‌టించిన "మిఠాయి" సినిమా శుక్ర‌వారం విడుద‌ల‌యింది. అది మిఠాయి కాదు చేదు కాక‌ర‌కాయ్ అని క్రిటిక్స్ తేల్చారు. ఐతే విడుద‌లైన మ‌ర్నాడే రాహ‌ల్ త‌న సినిమాకి వ్య‌తిరేకంగా త‌నే ట్వీట్ చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది.

"మిఠాయి" సినిమా చేయ‌డం నాకు ఇష్టం లేక‌పోయిన‌ప్ప‌టికీ చేయాల్సి వ‌చ్చింద‌నీ, రిలీజ్‌కి ముందు రిపేర్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించాం కానీ వ‌ర్క‌వుట్ కాలేదంటూ ట్వీట్ చేశాడు. చూసిన మీరంతా నిన్న నన్ను తిట్టుకొని ఉంటారు. ఇక‌పై ఇలాంటి సినిమాలు చేయ‌నన్న‌ట్లుగా వ‌రుస‌గా ట్వీట్లు సంధించాడు. దానివ‌ల్ల త‌న‌కి ప్ల‌స్ అవుతుంద‌ని అత‌ను భావించి ఉంటాడు. కానీ ఇది పూర్తిగా అన్‌ప్రొఫెషిన‌లిజం.

హీరోగా న‌టించిన త‌ర్వాత రేటింగ్‌లు బాగా రాలేద‌నో, ఫీడ్‌బ్యాక్ బాలేద‌నో మొద‌టి రోజుకే సినిమాకి వ్య‌తిరేకంగా ట్వీట్ చేయ‌డం అంటే నిర్మాత‌ని, కొన్న‌వారిని నిండా ముంచ‌డ‌మే. అంటే వీకెండ్‌లో థియేట‌ర్‌కి ఎవ‌రైనా వ‌ద్దామ‌నుకున్నా రాకుండా ఆపే కార్య‌క్ర‌మం. దానివ‌ల్ల రాహుల్‌కి నష్టం ఉండ‌దు. కానీ నిర్మాత‌ల‌కి, కొన్న‌వారికి న‌ష్ట‌మే క‌దా. వ‌చ్చే ఎంతో కొంత మ‌నీని రాకుండా ఆప‌డం ఎంత‌వ‌ర‌కు క‌రెక్ట్‌.

ఓ వారం త‌ర్వాత ఇలాంటి సినిమాలు చేయ‌న‌ని ట్వీట్ చేస్తే కొంత హుందాగా ఉండేది. ఇదేం ప్రొఫెషిన‌లిజం. సినిమాలో హీరోగా న‌టించ‌డం అంటే కామెడీ కాదు అని అంద‌రూ విమ‌ర్శ‌లు చేయ‌గానే వెంట‌నే త‌న ట్విట్ట‌ర్ హ్యండిల్‌ని స్లీప్ మోడ్‌లో పెట్టిన‌ట్లు ఉన్నాడు. ప్ర‌స్తుతం అత‌ని అకౌంట్ కనిపించ‌డం లేదు.