రేపటిదాక ఆగు రాములా

Ramulo Ramula song launch postponed
Monday, October 21, 2019 - 14:45

"రాములో రాములా"  అనే పాటని ఈ రోజు సాయంత్రం విడుదల చేస్తామని ప్రకటించింది అల్లు అర్జున్, త్రివిక్రమ్ టీం. కానీ ఈ పాట విడుదల వాయిదా పడింది. అక్టోబర్ 22 సాయంత్రం 4 గంటలకి ఈ పాట వస్తుందట. అనివార్య కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. 

ఇది పార్టీ సాంగ్ అని చెప్తోంది టీం. ఇంతకుముందు వచ్చిన "సామజవరాగమనా" అనే పాట బాగా వైరల్ అయింది. తెలుగు సినిమాల్లోనే అత్యధిక లైకులు పొందిన సాంగ్ గా పేరు తెచ్చుకుంది. ఇక ఈ రాములో రాములా పాట .. పార్టీల్లో, సంగీత్ కార్యక్రమాల్లో రెగ్యులర్ గా మోగే రేంజీలో ఉంటుందంట. థమన్ స్వరపరిచిన ఈ సాంగ్.. "ఆల వైకుంఠపురంలో" నుంచి రానుంది. 

బన్నీ, పూజ హెగ్డే  జంటగా నటిస్తున్న ఈ మూవీలో టబు కీలక పాత్ర పోషిస్తున్నారు.