కట్టప్ప, శివగామి రొమాంటిక్ పార్టీ

Ramyakrishna and Sathya Raj's romance
Tuesday, November 13, 2018 - 18:45

బాహుబలి సినిమాలో ప్రభాస్, రానా ఎంత పాపులర్ అయ్యారో.. కట్టప్పగా సత్యరాజ్, శివగామిగా రమ్యకృష్ణ కూడా అంతే పాపులర్ అయ్యారు. ఇప్పటికీ తెలుగు ఆడియన్స్ కు సత్యరాజ్ పేరు కంటే కట్టప్ప అంటేనే ఈజీగా గుర్తుపడతారు. బాహుబలిలో రాజమాతగా మెప్పించిన రమ్యకృష్ణ, కట్టుబానిసగా జీవించిన సత్యరాజ్.. ఇప్పుడు మరోసారి కలిశారు. అయితే ఇద్దరూ కలిసి ఆడియన్స్ కు దాదాపు షాక్ ఇస్తున్నారు.

పార్టీ అనే సినిమాలో కీలకపాత్రలు పోషించారు సత్యరాజ్, రమ్యకృష్ణ. అలా అని ఇవి వయసు మళ్లిన క్యారెక్టర్స్ కావు. సినిమాలో సత్యరాజ్ పాతికేళ్ల కుర్రాడు. రమ్యకృష్ణ కూడా టీనేజ్ అయ్యాయి. వీళ్లిద్దరి మధ్య మాంఛి రొమాంటిక్ ట్రాక్ ఉంది. అంతేకాదు ఘాటు డ్యూయట్ కూడా ఉంది.

కట్టప్ప, శివగామి పాత్రల్ని మరిచిపోని తెలుగు ప్రేక్షకులు ఈ జంటను రొమాంటిక్ యాంగిల్ లో చూసి తట్టుకోగలరా అనేది ప్రశ్న. అయితే సినిమాలో వీళ్లిద్దరి పాత్రలు కడుపుబ్బా నవ్విస్తాయని, కేవలం కామెడీ కోసమే వాళ్లకు మేకోవర్స్ చేశామని చెబుతున్నాడు దర్శకుడు వెంకట్ ప్రభు.