రానాకి త్రిష రిట‌ర్న్ గిఫ్ట్‌?

Rana Trisha old affair, new wounds
Friday, December 28, 2018 - 00:30

రానా, త్రిష ఓ రేంజ్‌లో డేటింగ్ చేసుకున్నారు కొన్నేళ్ల క్రితం. అది అంద‌రికీ తెలిసిన న్యూసే. ఒక టైమ్‌లో త్రిష‌ని పెళ్లాడేందుకు రెడీ అయ్యాడు రానా. ఐతే కొన్ని కార‌ణాల వ‌ల్ల (కుటుంబ స‌భ్యుల అబ్జెక్ష‌న్ అనేది ఇండ‌స్ట్రీ గుస‌గుస‌) వారు బ్రేక‌ప్ చెప్పుకున్నారు. ఇదంతా పాత కాల‌పు న్యూస్‌. ఈ గ్యాప్‌లో ఆమె..దాన్ని మ‌రిచిపోయింది. లైఫ్‌లోనూ, కెరియ‌ర్ ప‌రంగా ముందుకెళ్లింది. ఇపుడు ఆమె జీవితంలోకి వేరే వ్య‌క్తి వ‌చ్చాడు (ఇప్ప‌టికీ తాను సింగిల్ అని త్రిష చెపుతోంది. అది వేరే విష‌యం).

ఐతే త‌న బ‌తుకు తాను బ‌తుకుతున్న టైమ్‌లో రానా.. త‌న పాత ల‌వ్ ఎఫైర్‌ని బ‌య‌ట‌పెట్ట‌డం త్రిషకి కాలింద‌ట‌. క‌ర‌ణ్ జోహ‌ర్ టాక్ షోలో అత‌ను త్రిష‌ని ప్రేమించిన మాట వాస్త‌వ‌మే కానీ బ్రేక‌ప్ చెప్పుకున్నామ‌ని తెలిపాడు. ఆమె గురించి మాట్లాడిల్సిన అవ‌స‌రం లేని సంద‌ర్భంలో మాట్లాడాడు. దాంతో త్రిష కూడా అస‌లు రానాతో ఎందుకు బ్రేక‌ప్ చెప్పాల్సి వ‌చ్చిందో, త‌మ ప్రేమ‌క‌థ‌లో విల‌న్లు ఎవ‌రో బ‌య‌ట‌పెట్టాల‌నుకుంటుంద‌ట‌.

అలా రానాకి త్రిష రిట‌ర్న్ గిఫ్ట్ ప్లాన్ చేసింద‌ని చెన్నై కోడంబాకం కోడైకూస్తోంది.