ప్ర‌మోష‌న్‌కి అంద‌ర్నీ లాగుతున్న రానా

Rana is using all celebs for promotion
Sunday, August 19, 2018 - 00:15

రానా ఒక చిన్న సినిమాకి ప్రెజెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. "కేరాఫ్ కంచ‌రపాలెం" అనే పేరుతో రూపొందిన ఈ మూవీని హిట్ చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నాడు. ఇటీవ‌ల త‌మ బ్యాన‌ర్ నుంచి వ‌చ్చిన ఈ న‌గ‌రానికి ఏమైంది ఆడ‌లేదు. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకోలేదు. దాంతో ఈ చిన్న సినిమా ప్ర‌మోష‌న్ బాధ్య‌త‌ల‌ను త‌న భుజానా వేసుకున్నాడు. 

వెంకటేశ్‌ మహా అనే కొత్త ద‌ర్శ‌కుడు తీసిన ఈ సినిమా వైజాగ్ స‌మీపంలోని కంచ‌ర‌పాలెం అనే ఊరు నేప‌థ్యంగా సాగుతుంది. ఆఫ్‌బీట్ మూవీ. ఇప్ప‌టికే కొన్ని అంత‌ర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో ప్ర‌ద‌ర్శించాడు. అక్క‌డ ప్ర‌శంస‌లు కూడా అందుకుంద‌ట‌. ఈ సినిమాని టాలీవుడ్‌కి చెందిన పలువురు ద‌ర్శ‌కుల‌కి, కొంత మంది ఫిల్మ్ ల‌వ‌ర్స్‌కి ఇప్ప‌టికే చూపించారు. వారు అంద‌రూ సినిమాకి ప్ర‌శంస‌లు కుర‌పించారు. ఇక ఇపుడు సామాన్య జ‌నం చూడాలి. సెప్టెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది ఈ మూవీ. ఐతే ఈ సినిమా ప్ర‌మోష‌న్‌కి రానా త‌న కాంటాక్ట్స్‌ని అన్నింటిని వాడేస్తున్నాడు.

రాజ‌మౌళి స‌హా అంద‌ర్నీ రంగంలోకి దించాడు. ఇప్పటికే  దర్శకులు క్రిష్‌, సుకుమార్‌ మాట్లాడారు. తాజాగా రాజ‌మౌళి ప్రశంసించారు. ఆయన మాట్లాడుతున్న వీడియోను రానా షేర్‌ చేశారు. అంటే ఇండ‌స్ట్రీలో ఉన్న త‌న స‌న్నిహిత ద‌ర్శ‌కులంద‌ర్నీ ఈ సినిమా ప్ర‌మోష‌న్‌కి రానా వాడేస్తున్నాడు.