సుబ్ర‌మ‌ణ్య‌పురంలో భ‌ల్లాలాదేవుడు

Rana voice over for Subramanyapuram
Saturday, December 1, 2018 - 14:15

సుమంత్ న‌టించిన కొత్త చిత్రం....సుబ్ర‌మ‌ణ్య‌పురం. ఈ సినిమాలో రానా వాయిస్ వినిపిస్తుంది. రానా వాయిస్ సినిమా అంతా వినిపించబోతుందట‌.

సుబ్రహ్మణ్యపురం’’  కీలక సన్నివేశాలకు రానా వాయిస్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ రానాను సంప్రదించింది.దానికి ఆయన వెంటనే అంగీకారం తెలిపారు.

దర్శకుడు సంతోష్ జగర్లపూడి పర్యవేక్షణలో రానా కొన్ని కీలక సన్నివేశాలకు వాయిస్ నిచ్చారు. ఈ చిత్రం కాన్సెప్ట్ ని తెలుసుకొని ఎగ్జైట్ అయ్యారు. కంటెంట్ ఉన్న సినిమా లలో భాగం అయ్యే టాలీవుడ్ హల్క్ రానా కు ‘‘సుబ్రహ్మణ్యపురం’’ ట్రైలర్ కూడా బాగా నచ్చింది.

‘‘సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్’’ పతాకం పై బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ‘‘సుబ్రహ్మణ్యపురం’’ చిత్రం డిసెంబర్ 7న గ్రాండ్ గా విడుదలకు కాబోతుంది.