ఈ మ‌హేష్ కూడా హీరో అయ్యాడే!

Rangasthalam Mahesh turns hero
Tuesday, February 26, 2019 - 23:15

"రంగ‌స్థ‌లం"లో రామ్‌చ‌ర‌ణ్ ప‌క్క‌న ఉండే ఓ బ‌క్క ప‌లుచ‌టి కుర్రాడు గుర్తున్నాడా? అనేక సినిమాల్లో ఆ కుర్రాడు న‌టించాడు కానీ రంగ‌స్థ‌లం బాగా పేరు తెచ్చింది. అత‌నే జ‌బ‌ర్‌ద‌స్త్ మ‌హేష్‌. ఇప్ప‌టి వ‌ర‌కు చిన్న చిన్న పాత్ర‌లు పోషించిన మ‌హేష్ ఇపుడు హీరో అయ్యాడు. అత‌ను హీరోగా న‌టించిన తొలి చిత్రం పేరు...."నేను నా నాగార్జున‌". ఆర్‌.బి.గోపాల్ దర్శ‌క‌త్వంలో గుండ‌పు నాగేశ్వ‌ర‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్ట‌ర్‌ను ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌, క‌ళాబందు డాక్ట‌ర్‌ టి.సుబ్బ‌రామిరెడ్డి ఆవిష్క‌రించారు.

మ‌హేష్ స‌ర‌స‌న సోమివ‌ర్మ అనే భామ న‌టిస్తోంది. జ‌బ‌ర్‌ద‌స్త్ కార్యక్ర‌మంలో క‌నిపించి ఆ త‌ర్వాత టాలీవుడ్‌లో క‌మెడియ‌న్లుగా మారిన వారి సంఖ్య చాలా ఉంది. ఆ త‌ర్వాత వారే హీరోలుగా మారిన వారిలో ష‌క‌ల‌క శంక‌ర్ లాంటి వారున్నారు. ఇపుడు మ‌హేష్ కూడా ష‌క‌ల‌క‌లాగా హీరోగా ల‌క్‌ని ప‌రీక్షించుకుంటున్నాడు.