ఆమె తొడ‌ల‌కి ఇన్సూరెన్స్ కావాలిట‌

Rashmi Gautam asks someone insure her thighs
Tuesday, August 21, 2018 - 14:30

ర‌ష్మీ గౌత‌మ్ మంచి అందెగ‌త్తె అన‌డం క‌న్నాఆమెలో మంచి సెక్సీప్పీల్ ఉంద‌న‌డం క‌రెక్ట్‌. ఆమెలో సెక్సీప్పీల్ అంతా ఆమె కాళ్ల‌ల్లోనే ఉంద‌ట‌. క‌ళ్లు కాదండి కాళ్లు. అది ఆమె అభిమానుల మాట‌. ఆమెకి ముద్దుగా థండ‌ర్ థైస్ గాల్ అనే పేరు కూడా పెట్టారు. ఈ విష‌యాన్ని ఆమె కూడా అంగీక‌రిస్తుంది. ఇందులో సిగ్గుప‌డాల్సిన విష‌యం ఏమీ లేదని చెపుతోంది.

"ఒక్కొక్క‌రిలో ఒక్కో అందం అంటుంది. బ‌హుశా నా థైస్ (తొడ‌లు) జ‌నాల్ని ఆక‌ట్టుకుంటున్నాయోమో," అని నిర్మోహ‌మాటంగా చెప్పింది ఈ సుంద‌రి. అందుకే ఆమెతో సినిమాలు తీస్తున్న ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఆమె లెగ్స్‌ని ఎక్కువ‌గా ఎక్స్‌పోజింగ్ చేయించి వాటిని ప్ర‌మోష‌న్ పోస్ట‌ర్‌ల‌లో వాడుతున్నారు. ఆమె న‌టించిన తాజా చిత్రం.."అంత‌కు మించి". ఈ సినిమా ఈ వీకెండ్ విడుద‌ల కానుంది.

ఆమె త‌న కాళ్ల గురించి ఎవ‌రో కామెంట్ చేస్తే...దానికి ట్విట్ట‌ర్‌లో స్పందించింది. వాటికి బీమా క‌ల్పించండి ప్లీజ్ అంటూ స‌ర‌దాగా వ్యాఖ్యానించింది. హాలీవుడ్‌లో హీరోయిన్లు అంద‌రూ త‌మ శ‌రీర భాగాల‌ను ఇన్సూర్ చేస్తారు. జెన్నిఫ‌ర్ లొఫెజ్ త‌న జ‌ఘ‌న భాగాన్ని ఇన్సూర్ చేసింది. సో.. ర‌ష్మీ తొడ‌ల‌కి బీమా చెయ్యాలిట‌.