ఆమె గ్లామ‌ర్‌కి ఓపెనింగ్స్ వ‌స్తాయి!

Rashmi Gautam proves she can attract the youth
Monday, August 27, 2018 - 00:30

ఏ మాట‌కి ఆ మాటే చెప్పుకోవాలి. ర‌ష్మీ గౌత‌మ్‌కి ఎంతో కొంత ఇప్ప‌టికీ క్రేజుంది.  పోస్ట‌ర్ల‌లో, ట్ర‌యిల‌ర్ల‌లో ఆమె తొడ‌లు చూపితే.. జ‌నం థియేట‌ర్లకి క్యూ క‌డుతారు. భారీగా క్యూ క‌ట్ట‌క‌పోయినా.. ఎంతో కొంత ఓపెనింగ్స్ అయితే వ‌స్తాయి ఆమె థై షోతో.  ఈ విష‌యం మ‌రోసారి "అంత‌కు మించి" సినిమాతో ప్రూవ్ అయింది. 

"అంత‌కు మించి" అనే సినిమాకి ద‌ర్శ‌కుడు ఎవ‌రో తెలియ‌దు. (కొత్త) హీరో ఫేస్ చూస్తే..ఒక్క టికెట్ కూడా తెగ‌దు. ఐనా అంత‌కు మించి సినిమాకి హైద‌రాబాద్‌, ఇత‌ర ప్రాంతాల్లో మంచి ఓపెనింగ్స్ వ‌చ్చాయి. గ‌త వీకెండ్ విడుద‌లైన నాలుగు సినిమాల్లో ఎక్కువ క‌లెక్ష‌న్లు తెచ్చుకున్న‌ది ఈ సినిమానే. అంటే ఇదేదో పెద్ద హిట్ అయింద‌ని అనుకోవ‌ద్దు. "లో" క‌లెక్ష‌న్లు సాధించిన ఆ నాలుగు సినిమాల్లో హై" (ఎక్కువ) క‌లెక్ష‌న్లు సాధించింది ఇదే. అంటే ఏంటి? ర‌ష్మీ గౌత‌మ్ అందాల షోకి రెడీమేడ్ ప్రేక్ష‌కులున్నార‌న్న‌మాట‌. 

ఆమె గ్లామ‌ర్ షోని చూసేందుకు ఇప్ప‌టికీ యూత్‌, మాస్‌లో ఒక వ‌ర్గం రెడీగా ఉంది. కాక‌పోతే..ఆమె ఉత్త షో చేస్తానంటే ఎవ‌రూ చూడ‌రు. దానికి త‌గ్గ మ‌సాలా క‌థ సినిమాలో ఉండాలి. అలాంటి క‌థ‌లు ఎంచుకుంటే ఆమె సినిమాల‌కి అంతో ఇంతో మార్కెట్ ఉంటుంద‌ని చెప్పొచ్చు. జ‌బ‌ర్‌ద‌స్త్ షోతో పాపుల‌ర్ అయిన ర‌ష్మీ గౌత‌మ్ ఇటీవ‌ల త‌న తొడ‌ల‌ను ఇన్సూరెన్స్ చేయించుకుంటాన‌ని కామెంట్ చేసి వార్త‌ల్లో నిలిచింది. అంతే కాదు, గ్లామ‌ర్ షో చేస్తే త‌ప్పేమీ ఉంద‌ని కూడా చెప్పింది. 

"గుంటూరు టాకీస్" సినిమాలో ముద్దుల సీన్లు, అందాల ఆర‌బోత సీన్ల‌తో బాగా క్రేజ్ తెచ్చుకొంది ర‌ష్మీ. ఆ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత మాత్రం ఆమె న‌టించిన సినిమాలేవీ ఆడ‌లేదు.