రాత్రికి రమ్మంటే వెళ్తా కానీ...

Rashmi Gautam's bold statement about one night stand
Wednesday, December 26, 2018 - 14:45

క్రిస్మస్ సందర్భంగా నెటిజన్లతో చాట్ చేసిన జబర్దస్త్ భామ రష్మి.. చాలా అంశాలపై బోల్డ్ గా రియాక్ట్ అయింది. ఇందులో భాగంగా ఓ తుంటరి అడిగిన ప్రశ్నకు అంతే తుంటరిగా సమాధానం ఇచ్చింది. "మీరు ఆశించిన డబ్బు కంటే ఎక్కువ డబ్బు ఇచ్చి రాత్రికి రమ్మంటే వస్తారా" అంటూ సోషల్ మీడియాలో ఓ వ్యక్తి రష్మిని ప్రశ్నించాడు. అది అడిగే వ్యక్తి స్థాయిని బట్టి ఉంటుందంటూ గడుసుగా సమాధానం ఇచ్చింది రష్మి.

ఒక్క సెక్స్ పైనే కాదు, చాలా అంశాలపై ఇలానే రియాక్ట్ అయింది. పెళ్లి కంటే ముందు పిల్లల్ని కలిగి ఉండాలనేది తన కాన్సెప్ట్ అని, అందుకే ఓ పాపను దత్తత తీసుకుంటానని చెబుతోంది.

ఇక సమ్మర్ లో బీర్, వింటర్ లో విస్కీ ఇష్టమంటున్న రష్మి.. పెళ్లి కంటే ముందు సహజీవనం అనే కాన్సెప్ట్ ఉందని, అదంటే తనకు చాలా ఇష్టమని సమాధానం చెప్పింది.

సుడిగాలి సుధీర్ అంటే ఇష్టమా, ప్రదీప్ అంటే ఇష్టమా అనే ప్రశ్నకు సమాధానంగా వృత్తి జీవితంలో ఇద్దరూ ఇష్టమేనని, కానీ వ్యక్తిగత జీవితంలో ఆ ఇద్దరి కంటే మరో వ్యక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఉందంటూ తన లవ్ ఎఫైర్ ను బయటపెట్టింది రష్మి. ఆ వ్యక్తి పేరును మాత్రం చెప్పలేదు. మహేష్ బాబుతో డేటింగ్ చేసే ఛాన్స్ వస్తే వెళ్తారా అనే ప్రశ్నకు తనకు ప్రస్తుతం మహేష్ బాబు కంటే ఆక్వామేన్ అంటే చాలా ఇష్టమని, అతడితో డేటింగ్ అయితే ఓకే అని ప్రకటించింది.