అఖిల్ స‌ర‌స‌న ర‌ష్మిక‌?

Rashmika opposite Akhil
Sunday, April 21, 2019 - 11:45

ఇంత‌కుముందే తెలుగుసినిమా.కామ్ రాసినట్లు.. అఖిల్ ఈ సారి కాస్త పెద్ద హీరోయిన్‌తో న‌టించాల‌నుకుంటున్నాడు. మొత్తానికి ఇపుడు అది కుదిరింది. యూత్‌లో క్రేజ్ ఉన్న ర‌ష్మికతో అఖిల్ న‌టించ‌నున్నాడు. ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ తీస్తున్న కొత్త సినిమాని అఖిల్ సైన్ చేశాడు. గీతాఆర్ట్స్ సంస్థ నిర్మించ‌నున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ల‌ను కూడా సంప్ర‌దించారు. కానీ ఫైన‌ల్‌గా ర‌ష్మిక‌నే తీసుకోవాల‌ని ఫిక్స్ అయ్యార‌ట‌.

ర‌ష్మిక ఇప్ప‌టికే మ‌హేష్‌బాబు, నితిన్ స‌ర‌స‌న న‌టించ‌నుంది. ఇపుడు అఖిల్ సినిమా కూడా సైన్ చేయ‌డం ఖాయ‌మేన‌ట‌. ఇక హీరోయిన్ ఫైన‌లైజ్ అయింది కాబ‌ట్టి.. ఆమె డేట్స్ అవి చూసుకొని సినిమాని మొద‌లుపెడుతారు. 

అఖిల్‌కి ఇప్ప‌టివ‌ర‌కు హిట్ రాలేదు. ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు అఖిల్‌.