నీకెవ్వరు సరిలేరు రష్మిక

Rashmika photos go viral
Thursday, November 7, 2019 - 14:45

రష్మికకు చెందిన 2 ఫొటోలు సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి. అది కూడా అఫీషియల్ స్టిల్స్ కావు. లీక్ అయిన ఫొటోలు. అవును.. సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి రష్మికకు చెందిన 2 స్టిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటికి తెగ లైక్స్ పడుతున్నాయి. జస్ట్ లంగావోణీలో కనిపించింది రష్మిక.

లంగావోణీలో రష్మిక అందంగా ఉందనేది ఒక రీజన్ అయితే, అవి మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ కావడం విశేషం. అందుకే సోషల్ మీడియాలో రష్మిక ఫొటోలకు అంత డిమాండ్ పెరిగింది.

రష్మిక స్టిల్స్ ఇలా వైరల్ అవ్వడం  ఇదే ఫస్ట్ టైమ్ కాదు. గతంలో డియర్ కామ్రేడ్, గీతగోవిందం టైమ్ లో కూడా రష్మికకు చెందిన స్టిల్స్ ఇలా లీక్ అయి, వైరల్ అయిన సందర్భాలున్నాయి. కాకపోతే లంగావోణీలో రష్మిక స్టిల్స్ ను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రష్మికను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అటు ఊహించని విధంగా తన ఫొటోలకు వచ్చిన రెస్పాన్స్ చూసి రష్మిక కూడా ఉబ్బితబ్బిబ్బవుతోంది.