సారీ.. డేటింగ్‌కి టైమ్ లేదు: ర‌ష్మిక‌

Rashmika talks about her man in life
Wednesday, July 24, 2019 - 09:00

ఎవర్నయినా ప్రేమిస్తున్నారా.. ఎవరితోనైనా డేటింగ్ లో ఉన్నారా..?

ఈ ప్రశ్నకు ఏ హీరోయిన్ అయినా కామన్ గా ఇచ్చే సమాధానం ఒక్కటే. ప్రస్తుతం తన లోకమంతా సినిమాలేనని, మూవీస్ నే ప్రేమిస్తున్నానని చెబుతారు. దాదాపు ఇవే మాటల్ని రష్మిక కూడా రిపీట్ చేసింది. కాకపోతే దీనికి ఇంకాస్త మసాలాను అద్దే ప్రయత్నం చేసింది. 

ప్రస్తుతం నేను సింగిల్ గా ఉన్నాను. డేటింగ్ చేసేంత టైమ్ నాకు లేదు. సినిమా సెట్స్ నుంచి ఇంటికెళ్లడం, అట్నుంచి అటు జిమ్ కు వెళ్లడం, మళ్లీ ఇంటికి రావడంతోనే సరిపోతోంది. రాత్రి 11-12కు ఇంటికొచ్చి పడుకొని మళ్లీ ఉదయం 6 గంటలకు షూటింగ్ కు రెడీ అవుతున్నాను. ఒక్కోసారి తిండి కూడా మరిచిపోతున్నాను.

ఇలా తను చాలా బిజీగా ఉన్నాననే విషయాన్ని చెప్పుకొచ్చింది రష్మిక. ఈమెకు ఓ కన్నడ నటుడితో పెళ్లి సెటిలై, అది రద్దయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈమె హీరో విజయ్ దేవరకొండకు దగ్గరైందంటూ పుకార్లు వచ్చాయి. వాటిపై నేరుగా స్పందించలేదు కానీ, తమ మనసులో ఎవరూ లేరని, డేటింగ్ కు టైమ్ లేదంటూ ఇలా పరోక్షంగా రియాక్ట్ అయింది రష్మిక.