మ‌మ్మ‌ల్ని ఇబ్బంది పెట్ట‌కండి..ర‌ష్మిక‌!

Rashmika in trouble over breakup with Rakshit
Tuesday, September 11, 2018 - 23:00

నిశ్చితార్థం ర‌ద్దు ర‌ష్మిక‌ని చాలా ఇబ్బందికి గురిచేస్తోంది. సోష‌ల్ మీడియాలోనూ, నేష‌న‌ల్ మీడియాలోనూ, మ‌న తెలుగు మీడియాలోనూ..ఎక్క‌డ చూసినా అదే టాపిక్‌. ఐతే మీడియాలో వార్త‌ల క‌న్నా క‌న్న‌డ అభిమానులు చేస్తున్న హంగామా ఆమెని, ఆమె త‌ల్లితండ్రుల‌ని బాధ‌పెడుతోంద‌ట‌. ర‌ష్మిక క‌న్న‌డ ద‌ర్శ‌కుడు, హీరో ర‌క్షిత్ షెట్టితో గ‌తేడాది జులైలో నిశ్చితార్థం చేసుకొంది. ఈ ఏడాది పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. ఐతే ఇద్ద‌రి మ‌ధ్య అభిప్రాయ భేదాలు రావ‌డంతో...ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్ చేసుకొని ఎవ‌రి దారి వారు చూసుకోవాల‌ని ఇద్ద‌రూ డిసైడ్ అయ్యారు.

మొద‌ట మీడియాలో ఈ వార్త‌లు వ‌చ్చిన‌పుడు ర‌ష్మిక స్పందించ‌లేదు. మౌనం వ‌హించింది. ఐతే ఎపుడైతే ఊహాగానాలు ఎక్కువ‌య్యాయో..అపుడు ర‌ష్మిక స‌న్నిహితులు మీడియాకి ఇన్‌ఫ‌ర్‌మేష‌న్ ఇచ్చారు. అఫీషియ‌ల్‌గా ఇద్ద‌రూ బ్రేక‌ప్ చేసుకున్న విష‌యాన్ని తెలిపారు. తాజాగా మీడియా ఆ వార్త‌లు ప్ర‌చురించ‌డంతో క‌న్న‌డ అభిమానులు..ర‌ష్మిక‌ని విల‌న్‌గా చిత్రీక‌రించ‌డం మొదలుపెట్టారు. తెలుగు సినిమాల మోజులో క‌న్న‌డ హీరో ర‌క్షిత్‌కి హ్యండిచ్చిందంటూ ఆమెని ట్రాల్ చేయ‌డం మొద‌లుపెట్టారు.

దాంతో ర‌ష్మిక వారిని తిట్ట‌లేక‌, వారించ‌లేక‌, స్పందించ‌లేక స‌త‌మ‌త‌మ‌వుతోంది. దాంతో ర‌ష్మిక త‌ల్లి మీడియాతో మాట్లాడింది. రీసెంట్ పరిణామాల‌తో తాము ఎంతో మాన‌సిక క్షోభ‌కి గుర‌య్యామ‌నీ చెప్పింది. త‌మ కూతురు జీవితానికి సంబంధించిన నిర్ణ‌యాన్ని ఆషామాషీగా తీసుకోమ‌ని తెలిపింది. అంతేకాదు అటు ర‌క్షిత్‌, ఇటు ర‌ష్మిక ఇద్ద‌రూ త‌మ‌కి ఏమి కావాలోతెలిసిన వారు. ఏదైనా వారిద్ద‌రి నిర్ణ‌య‌మ‌నే విష‌యాన్ని గ్ర‌హించాల‌ని ఆమె అభిమానుల‌ను కోరారు. ఇక ర‌ష్మిక మాజీ బాయ్‌ఫ్రెండ్ ర‌క్షిత్ షెట్టి కూడా ఆమెని స‌పోర్ట్ చేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు. మీడియా వార్త‌లు ఆధారంగా ఎవ‌రూ స్పందించొద్ద‌ని కోరాడు. ర‌ష్మికని ఏ విష‌యంలోనూ నిందించొద్ద‌ని, అన్ని నిదానంగా అంద‌రికీ తెలుస్తాయ‌నీ రాశాడు.

ర‌ష్మిక‌ కెరియ‌ర్‌లో బిగ్గెస్ట్ హిట్ .."గీత గోవిందం". అంత పెద్ద విజ‌యాన్ని ఆస్వాదించ‌లేని ప‌రిస్థితిలో ప‌డిందామె. ఈ వివాదంతో ఒక్క‌సారిగా సైలెంట్ అయింది.