నెక్స్ట్ గ్లామ‌ర్ రోలే!

Rashmika wil be seen in glam avatar in Devadas
Sunday, August 19, 2018 - 00:30

ర‌ష్మిక విష‌యంలో అంద‌రూ ఫిదా అవుతున్నారు. అందం, అభిన‌యం..అదిరిపోయాయి అంటున్నారు. గొప్ప అందెగ‌త్తె కాదు కానీ గీత పాత్ర‌లో చాలా బాగుంది అనేది అంద‌రి మాట‌. "గీత గోవిందం"లో హీరోని డామినేట్ చేసే రోల్‌లో నిజంగానే సూప‌ర్‌గా చేసింది ఈ క‌న్న‌డ క‌స్తూరి. 

బెంగుళూరులో పుట్టి పెరిగిన ర‌ష్మిక "కిరాక్ పార్టీ " అనే క‌న్న‌డ సినిమాతో పాపుల‌ర్ అయింది. ఆ త‌ర్వాత తెలుగులో ఛ‌లో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. త్వ‌ర‌లోనే నాగార్జున‌, నాని న‌టిస్తున్న "దేవ‌దాసు"లో క‌నిపించ‌నుంది. "దేవ‌దాసు"లో నాని స‌ర‌స‌న న‌టిస్తోంది. ఐతే ఈ సినిమాలో ఆమె పాత్ర‌కి పెద్ద‌గా ప్రాధాన్యం లేద‌ట‌. అంటే సాదాసీదా హీరోయిన్ రోలే. గ్లామ‌ర్‌కే ఎక్కువ స్కోప్ న‌ట‌న‌కి అంత‌గా ప్రాధాన్యమున్న పాత్ర కాదు.

గ్లామ‌ర్ అన‌గానే ఫుల్లు స్కిన్ షో చేసే పాత్ర అనుకునేరూ. అలాంటిది కాదు కానీ గీత పాత్ర‌కి ద‌క్కినంత ప్రాధాన్యం ద‌క్క‌దు. కొన్ని పాట‌లు, కొన్నిరొమాంటిక్ సీన్ల‌కి ప‌రిమితం అయ్యే పాత్ర‌. అటు నాగార్జున‌కి, ఇటు నానికి డామినేష‌న్ ఉన్న సినిమా అది. ఐతే ఇలాంటి పాత్ర‌లు చేసేందుకు అభ్యంత‌రం లేదంటోంది ర‌ష్మిక‌.