పండక్కి వచ్చేస్తున్నాం: చ‌రణ్‌

RC12 confirmed for Sankranthi 2019
Wednesday, October 31, 2018 - 15:30

రామ్ చరణ్, బోయపాటి సినిమాపై మేకర్స్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి వస్తున్నామని..ఇది ఫిక్స్ అని ప్రకటించారు. ఈ మేరకు డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓ ప్రకటన వచ్చింది.

బోయపాటి డైరక్షన్ లో రామ్ చరణ్ చేస్తున్న సినిమా లేట్ అవుతోందని, షెడ్యూల్స్ అన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయంటూ పుకార్లు వ్యాపించాయి. దీంతో సినిమా విడుదల అనుకున్న టైమ్ కు సాధ్యం కాకపోవచ్చని, సంక్రాంతి రాకపోవచ్చంటూ కథనాలు వచ్చాయి. దీనిపై వెంటనే రియాక్ట్ అయింది యూనిట్. "సంక్రాంతికి ఫిక్స్" అంటూ ప్రకటించింది.

ఈ సినిమాకు వినయ విధేయ రామ అనే టైటిల్ ఫిక్స్ చేశారని, అదే టైటిల్ తో దీపావళికి ఫస్ట్ లుక్ వస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై యూనిట్ స్పష్టత ఇవ్వలేదు. త్వరలోనే ఫస్ట్ లుక్ డీటెయిల్స్ చెబుతామని మాత్రమే ప్రకటించారు.

`` మెగాభిమానులు, ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను ధీటుగా సినిమాను ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మిస్తున్నాం. సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. రెండు పాట‌లు మిన‌హా న‌వంబ‌ర్ 10 నాటికి షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. న‌వంబ‌ర్ 9 నుండే డ‌బ్బింగ్ ప్రారంభిస్తాం. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల చేయ‌బోతున్నాం. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి 2019 సంక్రాంతి కానుక‌గా సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుద‌ల చేస్తున్నాం`` అని ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు నిర్మాత దాన‌య్య‌.