అనుష్క ఏడ్చింది ఇందుకే!

The real reason why Anushka cried
Sunday, March 22, 2020 - 21:15

ఎన్నడూ లేని విధంగా ఓ గేమ్ షోకు హాజరైంది అనుష్క. దీంతో ఆ చానెల్ వాళ్లు పండగ చేసుకున్నారు. అనుష్క కేంద్రంగా 2-3 ప్రోమోలు రిలీజ్ చేసి వదిలారు. షో మాట అటుంచితే ఆ ప్రోమోలు మాత్రం తెగ వైరల్ అయ్యాయి. ఆ ప్రోమోల ఆధారంగా కథలు అల్లేసిన వాళ్లు కూడా ఎక్కువైపోయారు. ఎట్టకేలకు నిన్న రాత్రి అనుష్క స్పెషల్  గెస్ట్ గా వచ్చిన ఆ గేమ్ షో టెలికాస్ట్ అయింది.

ప్రోమోల్లో అనుష్క ఏడుపు చూసి కొన్ని సైట్లు రకరకాల కథనాలు రాసేశాయి. ప్రభాస్ తో బ్రేకప్ అవ్వడం వల్లనే అనుష్క బాధ తట్టుకోలేక ఏడ్చేసిందంటూ ఏదేదో రాసేశారు. కానీ రాత్రి ఎపిసోడ్ చూసిన తర్వాత జనాలకు వేరే మేటర్ కనిపించింది. తనకు అరుంధతి లాంటి టర్నింగ్ పాయింట్ సినిమా అందించిన కోడి రామకృష్ణ మృతి పట్ల అనుష్క ఎమోషషనల్ అయింది.

కన్నీళ్లు పెట్టుకుంది, పక్కనే ఉన్న సుబ్బరాజు ఓదార్చాల్సి వచ్చింది. బాయ్ వచ్చి మంచినీళ్లు అందించాల్సి వచ్చింది. అంత ఎమోషనల్ అయింది అనుష్క. అందులో తప్పు కూడా లేదు. కానీ ప్రోమోలో కనిపించిన చిన్న సీన్ చూసి.. ఇదిగో తోక అంటే అదిగో పులి టైపులో సైట్లు ఏవి పడితే అవి రాసేశాయి. ఆ స్టోరీలు చదివిన తర్వాత రాత్రి అనుష్క ఎపిసోడ్ చూసిన జనం ఫక్కున నవ్వుతున్నారు.