సాక్షి టీవీ యాంకర్‌గా రేణుదేశాయ్

Renu Desai hosts Matti Manushulu on Sakshi TV
Monday, February 25, 2019 - 16:30

రేణు దేశాయ్ అంద‌ర్నీ స‌ర్‌ప్రైజ్ చేశారు. ఆమె ఇప్ప‌టికే బుల్లితెర‌పై ద‌ర్శ‌న‌మిచ్చారు కానీ ఆమె స‌డెన్‌గా ఒక న్యూస్ ఛానెల్ యాంక‌ర్‌గా మార‌డమే ఒక విచిత్రం. రేణు దేశాయ్ గ‌తంలో ఎంట‌ర్‌టెయిన్‌మెంట్ చానెల్స్‌ల‌లో సెల‌బ్రిటీ యాంక‌ర్‌గా, జ‌డ్జిగా క‌నిపించారు. ఇపుడు ఎన్నిక‌ల వేళ‌..ఆమె సాక్షి టీవీలో న్యూస్ ప్రోగ్రామ్ హోస్ట్‌గా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.

"మ‌ట్టి మ‌నుషులు" అనే ప్రోగ్రామ్‌ని ఆమె సాక్షి టీవీ కోసం నిర్వ‌హించ‌నుంది. ఒక‌వైపు, జ‌న‌సేనాని క‌ర్నూలులో రోడ్ షో నిర్వ‌హిస్తున్న వేళ‌, ఆయ‌న మాజీ భార్య సాక్షి టీవీ కోసం మ‌ట్టి మ‌నుషులు కార్య‌క్ర‌మాన్ని క‌ర్నూలు జిల్లాలోనే షూట్ చేస్తున్నారు.