ఇది ప్రెస్ మీటా.. డెయిలీ సీరియలా?

RGG3 press meet turns daily serial
Wednesday, October 16, 2019 - 17:15

దర్శకుడు ఓంకార్ కు ఇంకా టీవీ షోలు, రియాలటీ షోల అలవాటు పోయినట్టు లేదు. తన సినిమా ప్రచారం కోసం ప్రెస్ మీట్ పెట్టిన ఈ దర్శకుడు.. డెయిలీ సీరియల్ ను తలపించేలా ఎమోషన్ పండించాడు. సినిమా ఎలా ఉంటుందో చెప్పకుండా, సెంటిమెంట్ తో ఆకర్షించే ప్రయత్నం చేశాడు. రాజుగారి గది-3 హైలెట్స్ చెప్పకుండా అందరూ తమను, తమ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటూ మీడియాని కన్నీళ్లు పెట్టించాడు.

"ఈరోజు నేను ఈ పొజిషన్ లో ఉండడానికి కారణం నా తమ్ముళ్లు. ఎంతో కష్టపడి ఇండస్ట్రీకి వచ్చాం. నా కోసం వాళ్ల వృత్తిని కూడా త్యాగంచేశారు. వీళ్లకు నేను తప్పితే ఎవ్వరూ లేరు. లాస్ట్ ఇయర్ మా నాన్న చనిపోయారు. అప్పట్నుంచి వైట్ డ్రెస్ వేసుకుంటున్నారు. తమ్ముడ్ని హీరోగా చేసేంత వరకు వైట్ డ్రస్ విప్పను. ఛోటా కే నాయుడు నాకు దేవుడిచ్చిన అన్నయ్య. కుమార్ నాకు దేవుడిచ్చిన డిస్ట్రిబ్యూటర్."

చుశారుగా.. ఇలా సాగింది ఓంకార్ ప్రసంగం.. దాదాపు 10 నిమిషాలు మాట్లాడిన ఓంకార్, అందులో కేవలం 2 నిమిషాల్ని మాత్రమే సినిమాకు కేటాయించాడు. మిగతా టైమ్ మొత్తం సెంటిమెంట్ పండించడానికే ప్రయత్నించాడు. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది రాజుగారి గది 3 సినిమా.