పాల్ బుర్ర ప‌నిచేయాలనే కాళ్లు లాగాను

RGV and K A Paul funny tweets
Tuesday, January 15, 2019 - 21:15

ప్ర‌ముఖ ఇవాంజిలిస్ట్ కేఏ పాల్ బుర్ర స‌రిగా ప‌నిచేయాల‌నే ఉద్దేశంతో ఆయ‌న కాళ్లు లాగాను అంటున్నారు రాంగోపాల్ వ‌ర్మ. కాళ్లు లాగి కింద‌ప‌డితే..ఆయ‌న మైండ్ ప‌గిలి..కొంత సెట్ అవుతుంద‌నుకున్నార‌ట‌ ఆర్జీవీ. వ‌చ్చే ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 175 సీట్ల‌కి 175 సీట్లు గెలిచి సీఎంని అవుతాన‌ని ఒక స్టేట్‌మెంట్ ఇచ్చి అంద‌ర్నీ న‌వ్వుల్లో ముంచెత్తాడు. 

కేఏపాల్ రాజ‌కీయ స్టేట్‌మెంట్స్ యూట్యూబ్ వ్యూస్‌కి, న‌వ్వుకోవ‌డానికి, ట్రాలింగ్‌కి ఎక్కువ‌గా ఉప‌యోగ‌ప‌డుతుంటాయి. అనేక సినిమాల్లో అత‌న్ని మాట‌ల‌ను పేర‌డీగా మ‌లిచారు. గ‌త కొన్ని రోజులుగా ఆయ‌న చేస్తున్న స్టేట్‌మెంట్స్ మ‌రింత‌గా వైర‌ల్ అవుతున్నాయి. 

అయితే కేఏ పాల్ తాజాగా చేసిన ట్వీట్ క‌ల‌క‌లం రేపింది. వ‌ర్మ త‌న కాళ్ల‌కి న‌మ‌స్కారం చేసి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడ‌ని ట్వీటాడు. దానికి స‌మ‌ధానంగా, ఆర్జీవీ ఇలా ట్వీటాడు  - ప్రభువా ! నేను పాల్ కాళ్ళు ముట్టుకోలేదు..జస్ట్ పట్టుకుని గట్టిగా లాగితే వెనక్కి పడి తల నేల కేసి కొట్టుకుని తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా ..కాని మీరు హర్ట్ అవుతారేమోనని  వదిలేసా.