ఎలా ఉండేవాడు ఇలా అయ్యాడు

Ram Gopal Varma

రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు చెబితే “శివ”, “సత్య”, “కంపెనీ”, “క్షణక్షణం”, “రంగీలా”, “సర్కార్”.. ఇలాంటి ఎన్నో సినిమాలు గుర్తొస్తాయి. టాలీవుడ్ లోనే కాదు, భారతీయ సినీచరిత్రలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు వర్మ. ఇదంతా గతం.

మరి ఇప్పుడు వర్మ పేరు చెబితే ఏం గుర్తొస్తుంది.. ఓ కాంట్రవర్సీ, ఓ ప్రచారం, ఓ బూతు సినిమా. ఇవి మాత్రమే గుర్తొస్తాయి. ఇండియా అంతా ఆరాధనగా చూసే ఆర్జీవీ కాస్తా ఇప్పుడు అంతా ఈ పొజిషన్ కు వచ్చేశాడు. ఏకంగా అడల్ట్ సినిమాల ఫిల్మ్ మేకర్ గా స్థిర పడిపోతున్నాడా అన్న డౌట్స్ వస్తున్నాయి.

నిజానికి వర్మ తలుచుకుంటే ఇప్పటికీ ఓ మంచి సినిమా తీయగలడు, దేశాన్ని షేక్ చేసే కాన్సెప్ట్ తో దడ పుట్టించగలడు. కానీ అతడు తీయడు. గట్టిగా అడిగితే “నేనింతే.. నాకు నచ్చిన సినిమాలే తీస్తాను.. నచ్చితే చూడండి” అంటూ తనను తాను మోసం చేసుకుంటూ కాలం గడిపేస్తున్నాడు ఈ సినీ మేధావి.

నిజానికి ఏ దర్శకుడైనా తమలో సత్తా అయిపోయిన తర్వాత స్వచ్ఛందంగా తప్పుకుంటాడు. రాఘవేంద్రరావు నుంచి రవిరాజా పినిశెట్టి వరకు అంతా ఇదే పనిచేశారు. తలుచుకుంటే వాళ్లు కూడా ఇప్పటికీ ఏదో ఒక సినిమా తీయొచ్చు. కానీ అప్పటివరకు తెచ్చుకున్న పేరు పోగొట్టుకోవడం ఇష్టంలేక వాలంటరీగా తప్పుకున్నారు. ఓ ఏడేళ్ల కిందటే వర్మ ఈ పని చేసుంటే చాలా బాగుండేది. అదే ఇప్పుడతడ్ని విమర్శలపాలు చేస్తోంది.

కంటెంట్ ను నమ్ముకొని ఎప్పుడూ సినిమా తీయలేదు వర్మ. కేవలం వివాదాన్ని, ప్రచారాన్ని నమ్ముకొని మాత్రమే సినిమాలు తీశాడు, ఇంకా తీస్తున్నాడు. అతడు చేస్తున్న పెద్ద తప్పు ఇదే. ఇప్పటికైనా ఆత్మావలోకనం చేసుకొని మరో మంచి సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని, వింటేజ్ వర్మను చూపించాలని అతడి హార్డ్ కోర్ అభిమానులు కోరుకుంటున్నారు. 

Advertisement
 

More

Related Stories