భ‌క్తుడిగా మారిన రాముడు!

RGV prays at Tirupati temple
Friday, October 19, 2018 - 14:00

రాంగోపాల్ వ‌ర్మ‌ని సినిమా సెల‌బ్రిటీలంతా అభిమానంగా రామూ అని పిలుస్తారు. జ‌నాల‌కి ఆయ‌న ఆర్జీవీ, స‌న్నిహితుల‌కి రామూ. కానీ ఈ రాముడు దేవుడ్ని న‌మ్మ‌డు. ఆయ‌న ప‌ర‌మ నాస్తికుడు.

అలాంటి నాస్తిక‌వాది ఈ రోజు అన్న‌మ‌య్య‌గా మారిపోయాడు. తిరుమ‌ల దేవుడ్ని పూజించాడు. ప‌ర‌మ భ‌క్తుడిగా పండితుల నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నాడు, ప్ర‌సాదాలు అందుకున్నాడు. శాలువా కూడా తీసుకున్నాడు. త‌న జీవితంలో మొద‌టిసారిగా గుడికి వెళ్లాన‌ని ఆ త‌ర్వాత రాంగోపాల్ వ‌ర్మ ట్వీట్ చేశాడు.

రాంగోపాల్ వ‌ర్మ ల‌క్ష్మీపార్వ‌తి కోణంలో ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌ని తెర‌కెక్కించ‌నున్నాడు. దానికి "ల‌క్ష్మీస్ ఎన్టీఆర్" అనే పేరుని ఖ‌రారు చేశాడు. ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీ రామారావు జీవితంలోకి అడుగుపెట్టిన త‌ర్వాత ఆయ‌న జీవితం ఎలా మారింద‌నేది ఈ సినిమాలో చూపిస్తాడు. బాల‌య్య హీరోగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి ఇది పోటీ చిత్రం.

ఎన్టీరామారావు తిరుమ‌ల తిరుప‌తి వెంకటేశ్వ‌ర‌రస్వామి భ‌క్తుడు. ఏ మంచి ప‌ని చేయాల‌న్నా తిరుప‌తి నుంచే శ్రీకారం చుట్టేవార‌ట‌. అందుకే వ‌ర్మ మొద‌టిసారి త‌న జీవితంలో తిరుప‌తి వెళ్లి ద‌ర్శించుకున్నాడు.