ఇంజ‌నీరింగ్ రూమ్మేట్స్‌తో ఆర్జీవీ

RGV revisits his engineering college
Tuesday, May 28, 2019 - 13:45

రాంగోపాల్ వ‌ర్మ విజ‌య‌వాడ‌లోనే ఇంజ‌నీరింగ్ విద్య‌ని పూర్తి చేశారు. 80ల‌లో ఆయ‌న విజ‌య‌వాడ సిద్దార్థ్ ఇంజ‌నీరింగ్ కాలేజ్‌లో చదువుకున్నారు. ఆ రోజుల్లో తాను ఉన్న హాస్ట‌ల్ రూమ్‌ని తాజాగా సంద‌ర్శించారు. మంగ‌ళ‌వారం (మే 28, 2019) నాడు ఆయ‌న కాలేజ్‌కి వెళ్లి, త‌న రూమ్‌ని చూసుకున్నారు. ఒక‌పుడు ఆయ‌న ఉన్న హాస్ట‌ల్‌ని ఇపుడు గర్ల్స్ హాస్ట‌ల్‌గా మార్చార‌ట‌. తాను అపుడున్న రూమ్‌లో ఇపుడు అమ్మాయిలుంటున్నారు. ఆ అమ్మాయిల‌తో సెల్ఫీ దిగారు వ‌ర్మ‌. ఆ అమ్మాయిలు కూడా అపురూపంగా ఈ ఫోటోని బంధించుకున్నారు.

అప్ప‌ట్లో త‌న రూమ్ గోడ‌ల‌పై శ్రీదేవి పోస్ట‌ర్స్ ఉండేవ‌ట‌. ఆర్జీవీ (దివంగ‌త‌) శ్రీదేవికి వీరాభిమాని. ద‌ర్శ‌కుడ‌య్యాక ఆమెతో "క్ష‌ణ‌క్ష‌ణం", "గోవిందా గోవిందా" చిత్రాలు తీశారు.

వ‌ర్మ తాను రూపొందించిన "శివ" సినిమాకి ...విజ‌య‌వాడ కాలేజ్ రోజులే స్ఫూర్తి. అప్ప‌ట్లో విజ‌య‌వాడ‌లో రౌడీ గ్యాంగ్‌లు ఎక్కువ‌. వాటిని ద‌గ్గ‌ర్నుంచి చూసి క‌థ‌ని రాసుకున్నారు వ‌ర్మ‌. కాక‌పోతే...త‌న క‌థ‌ని హైద‌రాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో తీశారు వ‌ర్మ‌. "శివ" క్రియేట్ చేసిన సంచ‌ల‌నం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు క‌దా!