ప్ర‌పంచ‌శాంతి కోసం వ‌ర్మ‌, పాల్ యుద్దం

RGV trolls K A Paul
Saturday, February 9, 2019 - 13:00

ప్ర‌పంచ‌శాంతి కోసం ఎంతో ప్ర‌య‌త్నిస్తున్నారు కేఏపాల్‌. బిష‌ప్ పాల్‌గారి మాట‌ల‌ను మాత్రం మ‌న తెలుగు జ‌నాలు కామెడీగా తీసుకుంటున్నారు. ఏపీలో 175 సీట్ల‌కి 175 గెలుస్తాన‌న్న ఆయ‌న స్టేట్‌మెంట్స్‌ని నవ్వుకోవ‌డానికి వాడుకుంటున్నారు. జ‌నం సంగ‌తేమో కానీ ట్విట్ట‌ర్‌లో మాత్రం కేఏ పాల్‌ని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నాడు ద‌ర్శ‌కుడు వ‌ర్మ‌. పాల్‌ని రాంగోపాల్ వ‌ర్మ చేస్తున్న‌ట్లుగా ఎవ‌రూ ట్రాల్ చేయ‌డం లేదు.

కులం, మ‌తం వంటివి ప‌క్క‌న పెట్టి మ‌నందంరం భారత దేశాన్ని టాప్‌లో నిలపాలని కేఏ పాల్ ఎమోషనల్ గా ఇచ్చారు ఓ మెసేజ్‌. ఆ వీడియోను షేర్ చేస్తూ  వర్మ  వ‌రుస‌గా సెటైర్లు పేలుస్తున్నారు.