వ‌ర్మ మొత్తానికి సాధించాడు!

RGV's Lakshmi's NTR gets terrific openings
Saturday, March 30, 2019 - 10:30

"ల‌క్ష్మీస్ ఎన్టీఆర్" సినిమా విడుద‌ల అవుతుందా? లేక రిలీజ్ వ‌ర‌కు ఇలాగే డ్రామా చేసి...తెలుగుదేశం పార్టీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకొని సినిమాని ఆపేస్తాడా అని చాలా అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. ఐతే..వ‌ర్మ తాను మొండొడ్ని అని మ‌రోసారి ప్రూవ్ చేసుకున్నాడు. తాను అనుకున్న‌ది చెప్పాడు. అదే తీశాడు. అలాగే విడుద‌ల చేశాడు.

సినిమా గొప్ప‌గా లేదు, బ్యాడ్‌గా లేదు. జ‌స్ట్ ఓకే మూవీ. కాక‌పోతే ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడి క‌న్నా చాలా బెట‌ర్‌. రివ్యూస్ సంగ‌తెలా ఉన్నా...జ‌నం మాత్రం బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. క‌థానాయ‌కుడు సినిమాకి 3 రేటింగ్ ఇచ్చినా.. ఓపెనింగ్స్ రాలేదు. కానీ ఈ సినిమాకి నైజాంలో టెర్రిఫిక్ ఓపెనింగ్స్‌ని సాధించింది. అస‌లు వ‌ర్మ సినిమాకి వెళ్లాలనే థాట్ వ‌స్తేనే ద‌డుసుకుంటున్న టైమ్‌లో ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావ‌డం అంటే మాట‌లు కాదు. ఆ విష‌యంలో వ‌ర్మ సాధించాడు. ఈ సినిమా నిల‌బ‌డుతుందా అనేది చూడాలి. 

ఫ‌స్ట్‌రౌండ్‌లో వ‌ర్మ అనుకున్న‌ది సాధించాడు.