వర్మ ఆశ అడియాసే అయింది

RGV's plan didn't work out in AP
Thursday, April 11, 2019 - 14:45

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు ఈ రోజు పూర్తి అయ్యాయి. ఎన్నికలలోపు "లక్ష్మిస్ ఎన్టీఆర్" విడుదల చెయ్యాలని ఆర్జీవీ చాలా ట్రై చేసినా కుదరలేదు. తెలంగాణాలో సినిమా విడుదల అనుకున్న డేట్ కి అయింది. కానీ ఆయన అసలు లక్ష్యం చంద్రబాబు నాయుడికి ఎన్నికలల్లో బాడ్ చెయ్యాలని. అందుకే సినిమా తీశారు. ఇది కాదనలేని నిజం. 

 ఎన్నికల తర్వాత ఇప్పుడు రిలీజ్ అయినా ఆయన అనుకున్న టార్గెట్ రీచ్ కాలేరు. 

ఈ సినిమాలో అసలు విలన్ చంద్రబాబు నాయుడు. ఎన్నికల ముందు ఆంధ్రలో విడుదల అయి ఉంటే ....సినిమా ఎందుకు తీశారో ఆ లక్ష్యం నెరవేరేది. అయితే అక్కడ ఉన్నది చంద్రబాబు. ఆర్జీవీ కన్నా ముదురు. ఎవరి వ్యూహాలకి ఎలా చెక్ పెట్టాలో బాగా తెలుసు బాబుకి. ముఖ్యంగా లీగల్ ఫైట్లో బాబుని ఓడించండం ఎవడివల్లా కాదనేది రాజకీయ పండితుల మాట. ఆలా బాబు చేసిన లీగల్ కేసు కి ఆర్జీవీ చిత్తు అయ్యాడు. 

ఇక ఆంధ్రాలో "లక్ష్మిస్ ఎన్టీఆర్" ఎప్పుడు రిలీజ్ అయినా ఒక్కటే.