రిషబ్ తో హీరోయిన్ లవ్ మీటర్

Rishab dateing Urvashi Rautela
Monday, December 16, 2019 - 08:00

మొన్నటికిమొన్న క్రికెటర్ మనీష్ పాండే, కన్నడ హీరోయిన్ అశ్రిత షెట్టిని పెళ్లిచేసుకున్నాడు. అలా వీళ్లిద్దరి డేటింగ్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ లో మరో డేటింగ్ మొదలైంది. ఈసారి రిషబ్ పంత్ వంతు. బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రుతేలాతో ఈ కుర్ర క్రికెటర్ యమ జోరుగా ప్రేమాయణం సాగిస్తున్నాడనేది హాట్ హాట్ న్యూస్.

ఇక్కడే ఓ చిన్న కథ చెప్పుకోవాలి. ఊర్వశి రుతేలాకు క్రికెటర్లు కొత్త కాదు. మొన్నటివరకు ఆమె హార్దిక్ పాండ్యాతో డేటింగ్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. ఇద్దరూ కలిసి 2-3 సార్లు పబ్బులు, రెస్టారెంట్లలో దొరికిపోయారు కూడా. అయితే తమది డీప్ ఫ్రెండ్ షిప్ అంటూ తప్పించుకున్నారు ఇద్దరూ.

కట్ చేస్తే, ఇప్పుడు పాండ్యా స్థానంలో రిషబ్ పంత్ వచ్చి చేరాడు. ఇద్దరూ ముంబయిలో చాలా క్లోజ్ గా చెప్పపట్టాలేసుకొని తిరుగుతున్నారు. మీడియా కదిపితే, యథావిధిగా అదే రొటీన్ ఆన్సర్ ఇచ్చారనుకోండి, అది వేరే విషయం. కాకపోతే ఈసారి పాండ్యాలా కాకుండా.. పంత్ తో ఊర్వశి కాస్త సీరియస్ గా వ్యవహారం నడుపుతున్నట్టు తెలుస్తోంది.