తెలుగులో ఈమెని ప‌ట్టించుకోరా?

Ritu Varma not getting any new offers
Tuesday, July 30, 2019 - 10:00

రీతూ వ‌ర్మ మంచి అందెగ‌త్తె. అచ్చ తెలుగు హీరోయిన్‌. ఐనా ఆమెకి అవ‌కాశాలు రావ‌ట్లేదు. "పెళ్లి చూపులు" సినిమా విడుద‌లైన‌పుడు ఆ సినిమాలో న‌టించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు హీరోయిన్‌గా న‌టించిన రీతూ వ‌ర్మ‌కి ఎంతో క్రేజ్ వ‌చ్చింది. ఈ మూడేళ్ల‌ల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ తెలుగునాట మంచి స్టార్‌గా స్థిర‌ప‌డ్డాడు. కానీ విచిత్రంగా రీతూ వ‌ర్మ‌కి మాత్రం "పెళ్లిచూపులు" క్రేజ్ పెద్ద‌గా ఉప‌యోగ‌ప‌డిన‌ట్లు లేదు. ఆమె  మ‌రో మంచి ఆఫ‌ర్ పొంద‌లేక‌పోయింది ఇక్క‌డ‌.

దానికి కార‌ణం..స్వ‌యంకృతమే. పెళ్లిచూపులు సినిమా చూసి ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ ఫిదా అయిపోయాడు. ఆమెతో త‌న నెక్స్ట్ మూవీ అంటూ ప్ర‌క‌ట‌న చేశాడు. విక్ర‌మ్ స‌ర‌స‌న ఆమెని తీసుకున్నాడు. దాంతో ఈ గోదావ‌రి పిల్ల ఎగిరి గంతేసి ఒప్పుకొంది. త‌న కెరియ‌ర్ ఎక్క‌డికో వెళ్లిపోతుంద‌ని భావించింది. ఐతే రీసెంట్‌గా గౌత‌మ్ మీన‌న్ సినిమాల‌న్నీ ఆగిపోతున్నాయ‌ని గ్ర‌హించ‌లేక‌పోయింది. గౌత‌మ్ మీన‌న్ అనేక ఆర్థిక క‌ష్టాల్లో ఉన్నాడు. ఒక్క సినిమా విడుద‌ల చేయాల‌న్నా.. కోట్లు క‌ట్టాలి ఫైనాన్సియ‌ర్స్‌కి. అందుకే ఆయ‌న తీసిన ప‌లు సినిమాలు స‌గంలో ఆగి ఉన్నాయి. 

రీతూ వ‌ర్మ మ‌రో రెండు త‌మిళ సినిమాల‌ను అంగీక‌రించింది కానీ అవి కూడా విడుద‌ల కాలేదు. ఈ గ్యాప్‌లో "పెళ్లిచూపులు" నాటి క్రేజ్ అంతా పోయింది. దాంతో మ‌ళ్లీ అవ‌కాశాల కోసం ఫోటోసూట్‌లు చేసుకొని ... ద‌ర్శ‌క, నిర్మాత‌ల‌కి పోర్ట్‌ఫోలియోల‌ను పంపిస్తోంది. 

ఇక్క‌డ స‌క్సెస్ అంద‌రికీ రాదు. వ‌చ్చిన కొంద‌రికీ దాన్ని ఉప‌యోగించుకోవ‌డం రాదు. అందులో ఒక‌రు రీతూవ‌ర్మ‌.