ఇక జ‌బ‌ర్‌ద‌స్త్‌కే రోజా ప‌రిమితం!

Roja gets no ministry in AP cabinet
Saturday, June 8, 2019 - 22:30

ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న రోజాకి షాక్ ఇచ్చారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. మంత్రుల లిస్ట్‌లో తన పేరు ముందు ఉంటుంద‌ని భావించిన రోజాకి పూర్తిగా క‌ళ్లు బైర్లు క‌మ్మాయి. ఆమెకి ఏ పోస్ట్ ద‌క్క‌లేదు. డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి ఇస్తానంటే వ‌ద్ద‌ని చెప్పిన రోజా ఇపుడు పార్టీకి అందుబాటులో లేకుండా సైలంట‌య్యారు. 

మంత్రి ప‌ద‌వి గ్యారెంటీ అనే న‌మ్మ‌కంతో ఇక‌పై జ‌బ‌ర్‌ద‌స్త్ ప్రోగ్రాం చేయ‌లేన‌ని నిర్వాహ‌కుల‌కి హింట్ ఇచ్చారు రోజా. ఐతే ఇపుడు ఆమె య‌థావిధిగా జ‌బ‌ర్‌ద‌స్త్‌కి జ‌డ్డిగా ఉండొచ్చు. ఎమ్మెల్యేగా పెద్ద‌గా ప‌ని ఉండ‌దు కాబ‌ట్టి ఈ కార్య‌క్ర‌మం చేసుకోనేందుకు ఏ అడ్డంకి ఉండ‌దు. ఐతే, రోజాకి అన్యాయం జ‌రిగింద‌ని ఆమె ప్ర‌త్య‌ర్థులు కూడా అంటున్నారు. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబుని కానీ, ఆ పార్టీని కానీ, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ని కానీ...అంద‌ర్నీ గ‌ట్టిగా విమ‌ర్శించేది రోజా. జ‌గ‌న్ క‌న్నా ఎక్క‌వ ఆమె మాట్లాడింది. పార్టీ కోసం అంత క‌ష్ట‌ప‌డితే ఆమెకి మంత్రి ప‌ద‌వి రాలేదు. రెండున్న‌ర ఏళ్ల త‌ర్వాత ఇస్తామ‌ని జ‌గ‌న్ చెప్పార‌ట‌. ఐతే ఆమె మాత్రం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. కానీ ఎంత అసంతృప్తి ఉన్నా ఆమె ఇపుడు ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి. కొన్నాళ్లూ మౌనంగా ఉండ‌డం త‌ప్ప మ‌రేం చేయ‌లేని సీన్‌.