రౌడీబేబీ అద‌ర‌గొట్టింది క‌దా

Rowdy Baby song crosses 100 million views
Monday, January 21, 2019 - 15:30

డ్యాన్స్‌లో సాయి ప‌ల్ల‌వి ఇర‌గ‌దీస్తుంది. ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు న‌ట‌న‌తోనే ఎక్కువ పేరు తెచ్చుకొంది. కానీ ఆమెకి డ్యాన్స్‌కి బాగా పేరు వ‌చ్చే సంద‌ర్భాలు త‌క్క‌వ వ‌చ్చాయి. అలాంటి పాట‌ల్లో ఫిదాలో వ‌చ్చిండే, ప‌డి ప‌డి లేచే మ‌న‌సులో ఓ పాట ఉంటాయి. ఐతే ఆమె అస‌లైన డ్యాన్స్ స్కిల్స్ రీసెంట్‌గా త‌మిళ సినిమాలో చూశారంతా.

ధ‌నుష్ హీరోగా నటించి, నిర్మించిన మారి 2లో ఓ పాట ఉంది. యువ‌న్ శంక‌ర్ రాజా స్వ‌ర‌ప‌ర్చిన రౌడీ బేబీ అనే పాట‌లో సాయి ప‌ల్ల‌వి త‌న స్టెప్పుల మాయాజాలం ఏంటో చూపించింది. ప్ర‌భుదేవా డ్యాన్స్ కంపోజ్ చేశాడు. ఈ భామ అద‌ర‌గొట్టింది. అందుకే రెండు వారాల్లోనే ఈ పాట 100 మిలియ‌న్ వ్యూస్ పొందింది. ఇది ఒక రికార్డు.

సాయి ప‌ల్ల‌వికి రీసెంట్‌గా స‌రైన బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌గల్లేదు కానీ ఆమె టాలెంట్‌ని ఎవ‌రూ వంక పెట్ట‌లేరు.