డిస్కోరాజాకి కోటి ఇర‌వై ల‌క్ష‌ల సెట్‌

Rs 1.20 Cr set for Disco Raja
Monday, July 22, 2019 - 12:45

రవితేజ న‌టిస్తున్న కొత్త చిత్రం "డిస్కోరాజా". ఈ సినిమా కోసం తాజాగా  అన్న‌పూర్ణా ఏడెక‌రాల‌లో కొటి 20 ల‌క్ష‌ల రూపాయిల సెట్  వేశారు. అక్క‌డే షూటింగ్ జ‌రుపుకుంటోంది. సినిమా క‌థ‌లో ఈ సెట్ కీల‌కమ‌ట‌. ఈ సెట్ ని డైర‌క్ట్ గా థియేట‌ర్ లో చూస్తే ప్రేక్ష‌కులు థ్రిల్ ఫీల‌వ‌వుతార‌ట‌. ఇక ఈ సినిమాకి సంబంధించి మంచు కొండ‌ల‌కి సంబంధించిన కొన్ని సీన్లు ఉన్నాయి. ఎందుకంటే హీరో మంచుకొండ‌ల్లో ప‌డి అక్క‌డే కొన్నాళ్లూ చిక్కుకుంటాడు. ఇది ఈ సినిమాలో కీ పాయింట్‌. ఆ సీన్లని స్విట్జ‌ర్లాండ్‌లో తీయాల‌నుకుంటున్నారు.

ఐతే తాజాగా మ‌రికొన్ని కీల‌క‌మైన సీన్ల‌ని ఢిల్లీలో తీస్తార‌ట‌. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, ఇస్మార్ట్ శంక‌ర్ ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నేల టిక్కెట్ తర్వాత ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ అధినేత రామ్ తాళ్ళూరి... రవితేజ తో నిర్మిస్తున్న రెండో చిత్రమిది. 

"అగ‌ష్టు మెద‌టివారం  నుండి ఢిల్లి లో షూటింగ్ జ‌రుపుకుంటాము. ఈ షెడ్యూల్ లో న‌భా న‌టేష్ జాయిన్ అవుతుంది. ద‌ర్శ‌కుడు వి ఐ ఆనంద్ చాలా విజ‌న్‌ వున్న వ్య‌క్తి," అని నిర్మాత రామ్ తాళ్లూరి అన్నారు.