వేశ్య‌ పాత్ర‌లో ఆర్ఎక్స్ 100 బ్యూటీ

RX 100 Paayal Rajput as call girl in a film
Monday, May 27, 2019 - 14:45

"ఆర్ ఎక్స్ 100" బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్ స‌డెన్‌గా బిజీ అవుతోంది. ఇప్ప‌టికే ఆమె "వెంకీమామ‌"లో వెంక‌టేష్ స‌ర‌స‌న న‌టిస్తోంది. రీసెంట్‌గా "సీత‌"లో ఐటెంసాంగ్‌లో క‌నిపించింది. అలాగే "ఆర్‌డిఎక్స్ ల‌వ్ "అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. త‌మిళంలో ఒక మూవీ సెట్‌పై ఉంది.

ఇంత బిజీగా ఉన్న ఈ భామ ఒక కొత్త సినిమాలో చాలా బోల్డ్ రోల్ ఒప్పుకుంద‌ట‌. వేశ్య‌గా న‌టించ‌నుంద‌ట‌.

టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు బ‌యోపిక్‌లో ఆమె ఈ పాత్ర చేయ‌నుంద‌ట‌. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు బ‌యోపిక్‌ని ప్లాన్ చేస్తోంది ఓ నిర్మాణ సంస్థ. స్టువ‌ర్టుపురం దొంగ‌ల చ‌రిత్ర‌లో టైగ‌ర్‌ది ప్ర‌త్యేక‌మైన స్థానం. పేరుమోసిన ఈ గ‌జ‌దొంగ క‌థ‌లో చాలా మసాలా ఉంద‌ట‌. అందుకే సినిమాగా తీయ‌నున్నారు.

ఆ దొంగ‌కి, ఒక వేశ్వ‌కి మ‌ధ్య న‌డిచిన ప్రేమాయ‌ణాన్ని కూడా చూపించ‌నున్నారు. ఆ వేశ్య పాత్ర‌లో పాయ‌ల్ న‌టించ‌నుంద‌ట‌