ఆటిట్యూడ్ ప్రాబ్లెమ్ లేదట!

RX100 director says he doesn't attitude problem
Monday, April 27, 2020 - 16:00

"ఆర్ఎక్స్100" సినిమా వచ్చి రెండేళ్లు పూర్తి అయ్యాయి. పెద్ద హిట్ వచ్చిన కూడా ఇప్పటివరకు ఇంకో సినిమాని సెట్ మీదకు తీసుకెళ్లలేకపోయాడు. రవితేజ,  రామ్, బెల్లంకొండ శ్రీనివాస్, నాగ చైతన్య .... ఇలా ఎందరితోనో "మహా సముద్రం" అనే సినిమాని ప్లాన్ చేశాడు కానీ వర్క్ అవుట్ కాలేదు. అతని హెడ్ స్ట్రాంగ్ నేచర్ సమస్యలు సృష్టిస్తోంది అనేది ఇండస్ట్రీ టాక్.

"మహాసముద్రం" ప్రాజెక్టు లేట్ అవ్వడానికి తన యాటిట్యూడే కారణమని చాలామంది అనుకుంటున్నారని, తనతో పరిచయం ఉండేవాళ్లకు అది అబద్ధమనే విషయం తెలుస్తుందంటున్నాడు ఈ కుర్ర డైరక్టర్. అంతే కాదు, శర్వానంద్ హీరోగా "మహాసముద్రం" త్వరలోనే షురూ చేస్తాను అని చెప్తున్నాడు.

శర్వానంద్ అంటే తనకు ఎప్పుడూ ఇష్టమేనని, బహుశా ఆ ఇష్టంతోనే "మహాసముద్రం"లో ఓ పాత్రను శర్వాను దృష్టిలో పెట్టుకొని రాశానని చెప్పుకొచ్చాడు అజయ్.

"ఆర్ఎక్స్100 తర్వాత బాగా ప్రేమించిన స్టోరీ మహాసముద్రం. ఎందుకంత గ్యాప్ తీసుకున్నానంటే దానికి కారణం స్టోరీ. నా కథకు సూటయ్యే హీరోల కోసం వెయిట్ చేస్తున్నానంతే. ఎన్ని రోజులైనా వెయిట్ చేసి నాకు నచ్చినట్టు సినిమా తీసుకోవడం నాకిష్టం. ఆర్ఎక్స్100 లాగానే డిఫరెంట్ స్టోరీ. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఒక హీరోగా శర్వాను తీసుకున్నాం. మే నుంచి షూట్ అనుకున్నాం. అంతలోనే లాక్ డౌన్ పడింది," అని చెప్పాడు అజయ్ భూపతి.

"మహాసముద్రం" తర్వాత ఆర్ఎక్స్100-2 తీస్తానని ప్రకటించాడు.