సాహో మొదటి షో దుబాయ్‌లో

Saaho first screening in Dubai
Wednesday, August 28, 2019 - 12:45

సాహో సినిమా ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో విడుదల అవుతోంది. ఐతే ఈ సినిమా మొదటి షో ఎక్కడ పడనుందన్న విషయంలో క్లారిటీ వచ్చింది. సాహో ఓవర్‌సీస్‌ రైట్స్‌ని దుబాయ్‌కి చెందిన ఫార్స్‌ అనే సంస్థ కొనుక్కొంది. 42 కోట్ల రూపాయలు పెట్టి తీసుకొంది. అమెరికాలో మాత్రం సినిమాని యష్‌రాజ్‌ సంస్థ ద్వారా విడుదల చేస్తోంది.

దుబాయ్‌కి చెందిన సంస్థే కొన్నప్పుడు దుబాయ్‌లో మొదట షో పడాలి కదా. అదే జరుగుతోంది. ఇండియన్‌ టైమ్‌ ప్రకారం రేపు రాత్రి 10 గంటలకి దుబాయ్‌లో మొదటి షో పడుతుంది. అమెరికాలో భారత కాలమానం ప్రకారం రేపు అర్ధరాత్రి తర్వాత ప్రీమియర్‌ షోలు మొదలవుతాయి. ఇక ఇండియాలో మొదటి షో...శుక్రవారం తెల్లవారుఝామున మొదటి ఆట పడుతుంది.

భారీ అంచనాల మీద విడుదల అవుతున్న ఈ సినిమా కథపై చాలా పుకార్లు వచ్చాయి. అంచనాలు మామూలుగా లేవు. దర్శకుడు సుజీత్‌ లైఫ్‌ని ఛేంజ్‌ చేసే మూవీ. అలాగే ఈ సినిమా కూడా సంచలన విజయం సాధిస్తే... ప్రభాస్‌ స్టార్‌డమ్‌ని ఇప్పట్లో ఏ తెలుగు హీరో అందుకోలేడు. రేపు దుబాయ్‌లో షో పూర్తి కాగానే... ఫలితం ఎలా ఉండబోతుందో అంచనా వేస్తారు ట్రేడ్‌ పండితులు.