గేమ్ ఆడండి.. టిక్కెట్స్ గెలవండి

Saaho game has unique concept
Thursday, August 1, 2019 - 10:45

"సాహో" సినిమాకు సంబంధించి డిఫరెంట్ గా ప్రమోషన్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా సాహో వీడియో గేమ్ ఒకటి తయారుచేశారు. ఈనెల రెండో వారంలో లాంఛ్ కాబోతున్న ఈ గేమ్ ను సాహో థీమ్ తో డిజైన్ చేశారు. ఇందులో హీరో అచ్చం ప్రభాస్ లానే ఉంటాడు. గేమ్ ఎవరైతే ఆడతారో వాళ్లే ప్రభాస్ అన్నమాట. తన చేతిలో ఉన్న హైటెక్ వెపన్ తో సిటీలో ఉన్న గ్యాంగ్ స్టర్లను తుదముట్టిస్తాడు. గేమ్ ఆడేవాళ్లకు వాళ్ల పెర్ఫార్మెన్స్ బట్టి పాయింట్స్ ఇస్తారు. ఆ పాయింట్స్ ఆధారంగా సాహో సినిమాలో ప్రభాస్ వాడిన యాక్ససిరీస్ గెలుచుకునే ఛాన్స్ ఉంది. అంతేకాదు.. సాహో మూవీ టిక్కెట్లు కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది.

నిజానికి తెలుగు సినిమాలకు ఇలా వీడియో గేమ్స్ లాంఛ్ చేయడం కొత్తేంకాదు. గతంలో కొన్ని సినిమాలకు సంబంధించి ఇలానే వీడియో గేమ్స్ వచ్చాయి. అయితే వాటితో పోలిస్తే ఇది త్రీడీ-యానిమేషన్ తో లేటెస్ట్ టెక్నాలజీతో తెరకెక్కింది. హైదరాబాద్ కు చెందిన పిక్సలాట్ లాబ్స్ కంపెనీ ఈ గేమ్ ను క్రియేట్ చేసింది.

సాహో - ది గేమ్  వస్తోందనే విషయాన్ని ప్రభాస్ అఫీషియల్ గా ప్రకటించాడు. ఈ నెల రెండో వారంలో ప్రభాస్ చేతులమీదుగానే ఇది లాంఛ్ కాబోతోంది. అంతేకాదు, ఫస్ట్ గేమ్ ను ఆడేది కూడా ప్రభాసే.