అబ్బో పెద్ద స్కెచ్ వేశాడే సాహో స్టార్

Saaho has got good line-up
Wednesday, July 31, 2019 - 22:15

"సాహో" సినిమా విడుదలకి సరిగా నెల రోజుల టైమ్ మాత్రమే ఉంది. ఈ ఆగస్ట్ 30న రిలీజు అవుతోంది ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న "సాహో". దాదాపు 300 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ రికవరీ కావాలి అంటే మాటలు కాదు. ప్రీ రిలీజు వ్యాపారం కూడా కళ్లు చెదిరే రేంజ్లోనే జరుగుతోంది. ఐతే ముందస్తు వ్యాపారం కన్నా థియేటర్ల నుంచి వచ్చే కలెక్షన్లు వెరీ ఇంపార్టెంట్.

ఒక హీరో థియేటర్ల నుంచి ఎంత ఎక్కువ కలెక్షన్ ని రాబడితే...అతనికి ట్రేడ్ వర్గాల్లో అంత క్రేజు ఉంటుంది. థియేటర్ల కలెక్షన్లు... హీరో స్టార్ డమ్! కొలమానం అన్నమాట. అందుకే, సాహో టీమ్ సినిమాని ఐమాక్స్ లో  కూడా విడుదల చేస్తోంది.

ఐమ్యాక్స్ ప్రింట్లతో విడుదల కానున్న తొలి తెలుగు సినిమాగా "సాహో" రికార్డు క్రియేట్ చేయనుంది. "బాహుబలి" సినిమాని ఐమ్యాక్స్ థియేటర్లలో ప్రదర్శించారు కానీ ప్రింట్లు మాత్రం ఐమ్యాక్స్ కావు. ఈ సినిమాని ఐమ్యాక్స్ ప్రింట్లను వేరుగా ముద్రిస్తున్నారు. ఎందుకంటే దుబాయ్ లో  తీసిన కొన్ని యాక్షన్ సీన్లు హాలీవుడ్ సినిమాలకి ఏమాత్రం తీసిపోని రీతిలో ఉంటాయట.

ఇంత మేటరు ఉంది కాబట్టే సాహో రిలీజ్ మీటర్ ఆ రేంజ్ లో ఉంది. ఐమ్యాక్స్ థియేటర్లలో విడుదల, మెర్చైండిజింగ్, గేమ్లు, ఈవెంట్లు.. అన్నీ భారీగా ఉండనున్నాయి. ఆగస్ట్ మొదటి వారం నుంచి ప్రభాస్ ప్రమోషన్ మోత మోగించనున్నాడు.