ప్రభాస్‌ డూప్‌ ఇతనే

Saaho, here is the dupe of Prabhas
Saturday, September 21, 2019 - 20:30

సాహో సినిమాలో ప్రభాస్‌ చేసిన యాక్షన్‌ సీన్లు చూసి ఆహో ఓహో అన్నారు. కానీ అబుధాబిలో తీసిన ఆ కళ్లు చెదిరే స్టంట్స్‌లో అసలు విన్యాసాలు చేసింది ప్రభాస్‌ కాదు.  ఎర్ని అనే ఒక డూప్‌. ఏ యాక్షన్‌ సీన్‌ తీసినా...పెద్ద హీరోలు ఫైట్స్‌ చేయరు. డూప్స్‌ పాల్గొంటారు. అది అందరికీ తెలిసిందే. దీనికి ఏ హీరో మినహాయింపు కాదు. ఐతే..సాహో సినిమాలో మెచ్చుకోదగ్గది ఏదైనా ఉందంటే దుబాయ్‌, అబుధాబి యాక్షన్‌ సీన్లే. ఆ స్టంట్స్‌ చేసింది నేనే అంటూ ఆ డూప్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను పెట్టాడు.

కొన్నిసార్లు తెరపై మేజిక్‌ కనపడాలంటే... మండుటెండల్లో 105 డిగ్రీల వేడిలో మాస్క్‌ వేసుకొని నటించాల్సి వస్తుంది. సాహో కోసం అలా చేశాను. అబుధాబిలో నాతో పాటు షూటింగ్‌లో పాల్గొన్న వారందరికీ చీర్స్‌ అంటూ ఫోటోలు అప్‌లోడ్‌ చేశాడు. ప్రభాస్‌ని ట్యాగ్‌ కూడా చేశాడు. ప్రభాస్‌ ఫేస్‌కి, ఎర్నీ ఫేస్‌కి చాలా తేడా ఉంది. కానీ ఒడ్డూ, పొడువు మాత్రమ సేమే.