వయలెన్స్‌ వద్దు రొమాన్స్‌ ముద్దు

Saaho romantic still is too good
Sunday, August 25, 2019 - 10:15

"సాహో"కి సంబంధించి ఇప్పటి వరకు ఎక్కువగా యాక్షన్‌ సీన్లపైనే ఫోకస్‌ పెట్టారు. సినిమా టీజర్లలోనూ, ట్రయిలర్‌లోనూ గ్రాండ్‌ విజువల్స్‌, యాక్షన్‌ స్టంట్స్‌నే అధికంగా చూపించారు. హీరోయిన్‌ కూడా గన్‌ పట్టి ఫైట్స్‌లో పాల్గొన్నట్లు చూపించారు. ఐతే సినిమాలో రొమాన్స్‌కి పెద్ద ప్రాధాన్యం లేదని జనం పొరపాటు పడుతారేమోనని ఇపుడు ప్రమోషన్‌ ట్రాక్‌ మార్చేస్తోంది సాహో టీమ్‌.

ప్రభాస్‌, శ్రద్దకపూర్‌ రొమాంటిక్‌ స్టిల్స్‌ని ఇపుడు ఎక్కువగా విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదలైన బ్యాడ్‌ బాయ్‌ పాటలోనూ బోలెడంతా గ్లామర్‌ షో ఉంది. అంటే గన్స్‌తో పాటు బేబ్స్‌ చేసే సోయగాల షో కూడా ఫుల్లుగా ఉంటుంది. తాజాగా విడుదల చేసిన శ్రద్దకపూర్‌, ప్రభాస్‌ రొమాంటిక్‌ స్టిల్‌ అదిరింది. ఈ రొమాంటిక్‌ స్టిల్‌లోనూ ఆమె లెగ్‌ షో కూడా ఉండేలా చూసుకున్నారు. అంటే వయలెన్స్‌ డోస్‌ తగ్గించి రొమాన్స్‌ షాట్‌ ఇస్తున్నారన్నమాట.

"సాహో" సినిమా యూఎ సర్టిఫికెట్‌ పొందింది. ఈ సినిమాలో శ్రద్దాతో పాటు జాక్వెలీన్‌ కూడా అందాల ప్రదర్శన చేసింది. సో..గ్లామర్‌ లోటు ఏమీ లేదు.